Robbery in ATM: పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ప్రాంతంలో ఉన్న ఏటీఎం లో చోరీకి తెగబడ్డారు దుండగులు. జీడిమెట్ల పోలీస్ (Jeedimetla Police) స్టేషన్ పరిధి మార్కండేయ నగర్ లో ఉన్న హెచ్డిఎఫ్సి ఏటీఎం లో తెల్లవారుజామున సమయంలో దొంగలు ఏటీఎం మిషన్ ను గ్యాస్ కట్టర్స్ తో కట్ చేసి డబ్బులు ఇన్స్టాల్ చేసే బాక్స్ ను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు (police) నిమగ్నమయ్యారు.
Also Read: Gold Rates (09-07-2025): భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్ .. ఎంత తగ్గిందంటే?
స్పెషల్ డ్రైవ్ నిర్వహించినప్పటికీ..
కాగా మంగళవారం రాత్రి ఇదే మార్కండేయ నగర్ ప్రాంతంలో బాలనగర్ ఏసిపి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో (Jeedimetla Police) జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ బృందం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా ఉన్న వాహనాలు స్వాధీనం, బెల్ట్ షాపులో మద్యం పట్టివేత, పూర్వపు నేరస్తుల కౌన్సిలింగ్ తదితర అంశాలపై దాదాపుగా 40 మంది పోలీసు సిబ్బంది తనిఖీలు చేశారు. తనిఖీలు పూర్తయిన నాలుగు గంటల్లోనే ఇక్కడే ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎటిఎం ను కొల్లగొట్టి దుండగులు పోలీసులకు సవాల్ విసిరినట్టు అయింది.
Also Read: KTR Challenges CM Revanth: చర్చకు రాకుంటే ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి.. కేటీఆర్ సంచలన కామెంట్స్!