KTR Challenges CM Revanth( image credit: swetcha reporter)
Politics

KTR Challenges CM Revanth: చర్చకు రాకుంటే ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

KTR Challenges CM Revanth: ముఖ్యమంత్రికి మరో ఛాన్స్ ఇస్తున్నా, టైం, డేట్ ఆయనే డిసైడ్ చేసి రావాలని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. లేకుంటే ముక్కు నేలకు రాసి (KCR) కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  (Revanth Reddy) రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం మాత్రమే వచ్చు కాని, చర్చ చేయడం రాదన్న సంగతి తెలంగాణ ప్రజలకు మరోసారి తెలిసిందన్నారు. ఆయన అసమర్థత పాలనతో 18 నెలల నుంచి తెలంగాణలోని 70 లక్షల మంది అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు రైతులు, నిరుద్యోగులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేశాయో (Somajiguda Press Club) సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో చర్చిద్దామని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. చెప్పిన సమయానికి కేటీఆర్ (KTR) సోమాజిగూడకు వచ్చారు.

ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం బీఆర్ఎస్ నేతలతో పాటు ఒక నిమిషం మౌనం పాటించారు. రేవంత్ రెడ్డి కోసం కుర్చీ వేశారు. అనంతరం కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడారు. తన పేరు తీసి స్వయంగా ముఖ్యమంత్రే చర్చకు రావాలని సవాల్ విసిరితే స్వీకరించానని, సమాధానం చెప్పేందుకు సమగ్ర సమాచారంతో వచ్చానన్నారు. కానీ, ఆయన రాలేదని సెటైర్లు వేశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజక వర్గంలోనే 670 మంది రైతులకు రైతు భరోసా రాలేదన్నారు.

 Also Read: Temple Lands: యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ.. 20124.03 ఎకరాల కబ్జా!

వివరాలు ఇచ్చేందుకు సిద్ధం

రుణమాఫీ కానీ లక్షల మంది అధికారిక జాబితా తమ దగ్గర ఉందని వివరించారు. ఇక, రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న 670 మంది రైతుల వివరాలు, వడ్ల బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కు లేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన వారి జాబితా కూడా తమ దగ్గర ఉందన్నారు. ముఖ్యమంత్రి లేదా ఎవరైనా మంత్రులు చర్చకు వస్తే ఆ వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

రేవంత్‌కు అలవాటే

తొడలు కొట్టడం, రంకెలు వేయడం, సవాళ్లు విసిరి పారిపోవడం రేవంత్‌కు అలవాటే అని ఎద్దేవా చేశారు.  (Kodangal) కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారని, జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ (BRS)  సొంతంగా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పారని గుర్తు చేశారు. 18 నెలల నుంచి తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ (Congress)  అరాచక పాలనతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎరువుల కొరతతో రైతులు సతమతం అవుతున్నారని తెలిపారు. మళ్లీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ నిజంగానే ఆ పాత దుర్ధినాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఎరువులు, విత్తనాల కోసం లైన్‌లో నిలబడే ఆనాటి రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)  మళ్లీ తీసుకొచ్చిందని విమర్శించారు.

 Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?