Heart Attack: హృదయ సంబంధిత సమస్యలు ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వెంటాడుతున్నాయి. స్కూల్ పిల్లల నుంచి పండు ముసలివారి వరకూ హార్ట్ అటాక్ తో చనిపోతున్న ఘటనలు ఇటీవల చూస్తూనే ఉన్నాం. చూడటానికి ఎంతో ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్న వారు సైతం గుండె పోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దిగ్గజ నటి మాధురి దీక్షిత్ (Madhuri Dixit) భర్త డాక్టర్ శ్రీరామ్ నేనే (Dr Shriram Nene).. గుండెపోటుకు సంబంధించి కీలక విషయాలను పంచుకున్నారు.
గుండెపోటుకు కారణాలు అవే!
డాక్టర్ శ్రీరామ్ నేనే .. ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ (Cardiothoracic Surgeon). ఆయన తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా అల్లాబాడియా పాడ్ కాస్ట్ (Ranveer Allahbadia’s podcast) కు అతిథిగా పాల్గొన్న ఆయన.. గుండెపోటుకు గల ప్రధారణ కారణాలను పంచుకున్నారు. గుండెకు అతి ముఖ్యమైన మూడు ధమనుల్లో (3 main arteries) అడ్డుంకులు ఏర్పడటం హార్ట్ ఎటాక్ (Heart Attack)కు దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో (కరోనరీ ఆర్టరీస్) అడ్డంకి ఏర్పడినప్పుడు.. గుండె కండరాలకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల గుండె కణజాలం దెబ్బతింటుంది లేదా పనిచేయడం ఆగిపోతుంది. దీంతో చాతి నొప్పి, ఊపిరి ఆడకపోవడం, చెమటలు పట్టడం, దడ పెరగడం జరుగుతుంది’ అని డాక్టర్ శ్రీరామ్ అన్నారు.
View this post on Instagram
సైలెంట్ హార్ట్ ఎటాక్
అయితే 20 శాతం మంది గుండెపోటు రోగుల్లో ఎటువంటి హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపించవని డాక్టర్ శ్రీరామ్ అన్నారు. దీనిని దీనిని ‘సైలెంట్ హార్ట్ అటాక్’ (Silent Heart Attack)గా అభివర్ణించారు. ఛాతీ నొప్పి, ఒత్తిడి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సాధారణ లక్షణాలు కనిపించవని పేర్కొన్నారు. వాటికి బదులు వెన్నునొప్పి, అలసట, కాళ్లలో తిమ్మిరి లేదా గ్యాస్ట్రిక్ నొప్పి వంటి అసాధారణ లక్షణాలు కనిపించవచ్చని స్పష్టం చేశారు. అయితే అలాంటి వారు ఒక్కసారిగా కుప్పకూలిపోతారని చెప్పారు. వారికి గుండె ఆగిపోయే ప్రమాదం అధికంగా ఉందని తెలిపారు. లేదంటే కొన్ని సందర్భాల్లో మూర్చపోతారని స్పష్టం చేశారు.
Also Read: Rahul Gandhi on Modi: రాసి పెట్టుకోండి.. మోదీ ఆ పని చేస్తారు.. రాహుల్ గాంధీ సవాల్!
గుండెపోటును ఇలా నివారించండి!
హార్ట్ ఎటాక్ ను నివారించేందుకు డాక్టర్ శ్రీరామ్ నేనే కీలక సూచనలు చేశారు. అధిక ఫైబర్, తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిదని తెలిపారు. రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ వంటి వినియోగించాలని చెప్పారు. కార్డియో (నడక, ఈత, సైక్లింగ్), ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాల ద్వారా గుండెపై ఒత్తిడి తగ్గించుకోవచ్చని చెప్పారు. దూమపానం, మద్యం వంటి చెడు అలవాట్లు గుండెకు చేటు చేస్తాయని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్, షుగర్ స్థాయులను పరీక్షించుకుంటూ ఉండాలని చెప్పారు. దీని ద్వారా శరీరంలో ఏదైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించే అవకాశముంటుందని శ్రీరామ్ అన్నారు.