Medchal District (imagcredit:swetcha)
హైదరాబాద్

Medchal District: మేడ్చల్ ఫార్మా కంపెనీలో పేలిన బాయిలర్.. కార్మికుడికి గాయాలు

Medchal District: రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదం మిగిల్చిన పాషామైలారంలోని ఫార్మా కంపెనీలో కెమికల్ పేలిన ఘటన తరహాలోనే మేడ్చల్(Medchal) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కంపెనీలో పేలుడు సంభవించింది. స్థానికుల వివరాల ప్రకారం మేడ్చల్ పారిశ్రామిక వాడలోని ఆల్కలాయిడ్ కంపెనీలో బాయిలర్ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. షాపూర్‌కు చెందిన మూల శ్రీనివాస్ రెడ్డి(Srinivass Reddy) గత 12 సంవత్సరాలుగా కంపెనీలో పని చేస్తునాడు. మంగళవారం ఉదయం కంపెనీలో ఉన్న బాయిలర్ ఒకసారిగా పేలడంతో కుప్పకూలిపోయాడు. దీంతో కంపెనీ లోని తోటి కార్మికులు శ్రీనివాస్ రెడ్డిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మేడ్చల్ ఏసిపి

మేడ్చల్ పోలీస్ స్టేషన్(Medchal Police Station) పరిధిలో ఓ కంపెనీలో బాయిలర్ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటనపై మేడ్చల్ ఏసిపి శంకర్ రెడ్డి(ACP Shankar Reddy) మీడియా సమావేశం నిర్వహించారు. మేడ్చల్ చెక్ పోస్ట్‌లోని ఇండస్ట్రీయల్ ఏరియాలో గల ఆల్కలాయిడ్ కంపెనీలో బాయిలర్ పేలి శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న శ్రీనివాస్ రెడ్డిని మెరుగైన చికిత్స కై నగరంలోని ఎఐజీ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలం వద్ద ఎవరూ లేరని, శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే ఉన్నారని చెప్పారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Also Read: Minister Sridhar Babu: దివ్యాంగుల సంక్షేమానికి అన్ని విధాల కృషి.. మంత్రి శ్రీధర్ బాబు

తమకు ఎలాంటి సేఫ్టీ లేదు – కార్మికుడు రాజు

మేడ్చల్ చెక్ పోస్ట్ లోని ఇండస్ట్రీయల్ ఏరియాలో గల ఆల్కలాయిడ్ కంపెనీ(Alkaloid Company)లో తమకు ఎలాంటి సెఫ్టీ లేదని అందులో పనిచేసే కార్మికుడు రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. కంపెనీలో బాయిలర్ పేలి సహచర కార్మికుడు శ్రీనివాస్ రెడ్డికి బలమైన గాయాలు అయ్యాయని తెలిపారు. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి ఫెసిలిటిలు లేవన్నారు. విధులు చేస్తున్నామా ఇంటికి వస్తున్నామా? అని తప్పితే తమకు ఎలాంటి ఆధారం లేదన్నారు. తమకు ఏమైనా అయితే మాపైనే ఆదార పడుతున్న మా కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆందోళనగా ఉందన్నారు. గాయపడిన శ్రీనివాస్ రెడ్డికి పరిశ్రమ అండగా ఉండాలని కోరుతున్నానన్నారు.

Also Read: GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్‌లో స్పెషల్ డ్రైవ్‌.. ఫోకస్ పెంచిన జీహెచ్ఎంసీ

 

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!