Minister Sridhar Babu (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Minister Sridhar Babu: దివ్యాంగుల సంక్షేమానికి అన్ని విధాల కృషి.. మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu: దివ్యాంగులకు ప్రజా ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుంది. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, కాటారం, మల్హర్ రావు మండలాల్లో పర్యటించారు. మహదేవ్ పూర్ మండల కేంద్రంలో చిల్డ్రన్స్ పార్క్(Childrens Park) ను ప్రారంభించి, మహిళా శిశు సంక్షేమ శాఖ(Women and Child Welfare Department) ఆధ్వర్యంలో అలీంకో(Alim Co) సంస్థ ద్వారా అందిస్తున్న ఉపకరణాలు దివ్యాంగులకు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మలతో కలిసి పంపిణీ చేశారు.

ప్రభుత్వం దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దివ్యాంగులు(Disabled) సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దివ్యాన్గులకు అవసరమైన ఉపకరణాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని దివ్యాంగుల సంక్షేమానికి అన్ని విధాల కృషి చేస్తుందన్నారు. మహదేవ్ పూర్ మండలంలో సుమారు 200 మంది దివ్యాంగులను గుర్తించడం జరిగిందని వారిలో మొదటి విడతలో 50 మంది దివ్యాంగులకు వివిధ రకాలైన బ్యాటరీ ట్రై సైకిళ్ళు, సాధారణ ట్రై సైకిళ్ళు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, స్టాండ్లు వారి వారి వైకల్యాన్ని బట్టి అందిస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని ఇల్లు లేని దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్ల(ndiramma Homes)ను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.

Also Read: Telangana Government: సర్కార్ కీలక నిర్ణయం పరిపాలనలో మరింత పారదర్శకత!

600 డ్యూయల్ డెస్క్ బెంచీలు పంపిణీ

అతి త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్(Free Curent), సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు(Free Bus) సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకొక్క హామీని నెరవేరుస్తున్నామని మంత్రి తెలిపారు. అనంతరం మహదేవ్ పూర్ మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు సుమారు 90 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కాటారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించి, సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రాథమిక పాఠశాలలకు సిఎస్ఆర్ నిధుల ద్వారా విద్యార్థుల కోసం 600 డ్యూయల్ డెస్క్ బెంచీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలకు కావలసిన అవసరాల గురించి మంత్రి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

ఉపాధ్యాయులు కృషి

అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల(Govt Schools)లను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా రెండు జతల బట్టలు, పుస్తకాలు, అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు మొట్టమొదటి సారిగా కాటారం మండలం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను, ఉపాధ్యాయులను సంక్రాంతి, దసరా సెలవుల్లో హైదరాబాద్(Hyderabad), ఢిల్లీ(Delhi) లాంటి నగరాలకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేపడతామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలను తలదన్నేలా విద్యార్థులు విద్యను అభ్యసించాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క విద్యార్ధి ఇంగ్లీషులో మాట్లాడాలని చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

Also Read: Actress disorder: నాకు ఆ వ్యాధి ఉంది.. బెడ్‌పై వెక్కి వెక్కి ఏడ్చా.. స్టార్ నటి ఆవేదన!

అధ్యాపకులు కోరిన విధంగా ప్రహరీ గోడ

జిల్లా, మండల స్థాయి విద్యా శాఖ అధికారులు ప్రతి పాఠశాలను పరిశీలించాలని ఆదేశించారు. పాఠశాలలకు కావలసిన సౌకర్యాలు, అవసరాలు గురించి తెలుసుకొని నివేదికలు అందించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అధునాతంగా తీర్చి దిద్దడానికి సహకరించాలని ఆదేశించారు. కాటారాం జెడ్పీహెచ్ఎస్(ZPHS) పాఠశాల అధ్యాపకులు కోరిన విధంగా ప్రహరీ గోడ పునర్నిర్మాణం, సైన్స్ ల్యాబ్ కెమికల్స్‌ను అందిస్తామని అన్నారు. లైబ్రరీలో పుస్తకాలు, బెంచీలు, కంప్యూటర్‌లను సమకురుస్తామని మంత్రి తెలిపారు. హై స్కూల్‌లలో కూడా డ్యూయల్ డెస్క్ బెంచీలు అందించడానికి విద్యాశాఖ అధికారులు నివేదిక ఇవ్వాలని మంత్రి శ్రీధర్(Min Sridhar Babu) బాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Rahul Sherma), సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

 

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?