Kavitha Slams Revanth Reddy: కేసీఆర్ దమ్ము ఏంటో అందరికీ తెలుసని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. (Chandrababu) చంద్రబాబును పిలిచి ప్రజాభవన్‌లో హైదరాబాద్ (Hyderabad)బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్‌గా ఇచ్చిందే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు సోనియాగాంధీ (Sonia Gandhi) ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500, పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
అనంతరం సోనియాగాంధీకి పోస్ట్ కార్డులు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కేసీఆర్ (KCR) దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను రేవంత్ రెడ్డి (Revanth Reddy) అడిగితే తెలుస్తుందన్నారు. పోరాడి కేసీఆర్ తెలంగాణ సాధించడంతోనే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయబోరన్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై చర్చించే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. గ్యారంటీలపై, మహిళలకు, పింఛన్లు పొందే అవ్వా తాతలకు చేసిన మోసంపై చర్చిద్దామా? అని సవాల్ చేశారు. 2016లో అసలు పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు అనే ప్రస్తావనే లేదన్నారు.
Also Read: Jurala Project: జూరాలకు పోటెత్తిన వరద.. 13 గేట్లు ఎత్తివేత!
అబద్ధాలు ఆడటం (Revanth Reddy) రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తాను ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తించి హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించబోరని అన్నారు. సోనియాగాంధీ (Sonia Gandhi) ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో ప్రజలు నమ్మి కాంగ్రెస్ (Congress) పార్టీని గెలిపించారన్నారు.
హామీ మేరకు మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలని, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, పింఛన్ లబ్ధిదారులకు నెలకు రూ.4 వేలు, దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇచ్చేలా సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. సోనియాగాంధీ సంతకం పెట్టిన గ్యారంటీ కార్డులను ఎన్నికలకు ముందు ఇంటింటికీ పంపి ప్రజలను మోసం చేశారన్నారు.
Also Read: Software Employee Arrest: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లక్షల జీతం వదిలి డ్రగ్స్ దందా!