GHMC Commissioner (imagcredit:twitter)
హైదరాబాద్

GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్‌లో స్పెషల్ డ్రైవ్‌.. ఫోకస్ పెంచిన జీహెచ్ఎంసీ

GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ(GHMC)లో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా, శానిటేషన్ గాడీన పడటం లేదన్న విమర్శలున్నాయి. మధ్యలో స్పెషల్ డ్రైవ్‌లో నిర్వహిస్తున్నా, ఆశించిన స్థాయిలో శానిటేషన్ జరగకపోవటంతో రెండు నెలల క్రితం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆర్.వి. కర్ణన్ శానిటేషన్(Sanitization) ను గాడీన పెట్టేందుకు సరి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో శానిటేషన్, హెల్త్ పర్యవేక్షణ బాధ్యతలు ఒకే అదనపు కమిషనర్‌కు అప్పగించే వారు. కానీ గత గులాబీ(BJP) సర్కారు హయాంలో జీహెచ్ఎంసీలో పోస్టింగ్ కోసం పైరవీలు చేసుకుని వస్తున్న అధికారులను అకామిడెట్ చేసేందుకు లేని పోస్టులను సృష్టించి బాధ్యతలను అప్పగిస్తూ రావటంతో ఒక్కో విభాగానికి ఒక్కో అదనపు కమిషనర్, జాయింట్ కమిషనర్లు విధులు నిర్వర్తించే వారు. ఆర్. వి.కర్ణన్(RV Karnan) కమిషనర్‌గా వచ్చే సమయానికి జీహెచ్ఎంసీలో 14 మంది అదనపు కమిషనర్లు విధులు నిర్వహిస్తున్నారు.

ఎస్టేట్ విభాగానికి అదనపు కమిషనర్

వీరిలో శానిటేషన్ ఒక్క విభాగానికి ఒక అదనపు కమిషనర్ విధులు నిర్వహిస్తుండగా, మిగిలిన ఒక్కో విభాగానికి ఒక్కో అధికారి అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తుండటాన్ని గమనించిన కమిషనర్ అదనపు కమిషనర్ల సంఖ్య, వారి వల్ల జీహెచ్ఎంసీ(GHMC) పై పడుతున్న ఆర్థిక భారంపై తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేస్తూ, అదనపు కమిషనర్ల సంఖ్యను ప్రస్తుతం పదికి కుదించారు. పనిలో పనిగా శానిటేషన్ విభాగానికి హెల్త్ విభాగాన్ని జోడించి, ఒక అదనపు కమిషనర్‌తో పాటు ఇద్దరు జాయింట్ కమిషనర్లను నియమించారు. ఎస్టేట్ విభాగానికి అదనపు కమిషనర్ గా పని చేసిన ఎన్. అశోక్ సామ్రాట్(Ashock Samrat) ను శేరిలింగంపల్లి, కూకట్ పల్లి(Kukat Pally), ఖైరతాబాద్ మూడు జోన్లలో జరిగే శానిటేషన్ పనులను పర్యవేక్షించే బాధ్యతను అప్పగిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు జోన్ల శానిటేషన్ విభాగానికి జాయింట్ కమిషనర్ గా బదిలీ చేశారు.

Also Read: Maoists Surrendered: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు

శానిటేషన్ పై కాస్త అవగాహన

కొద్ది రోజుల క్రితం వరకు అదనపు కమిషనర్ (ఎలక్ట్రిసిటీ) గా వ్యవహారించిన వేణుగోపాల్ రెడ్డి(Venu Gopal Reddy)ని కూడా జాయింట్ కమిషనర్ గా నియమిస్తూ చార్మినార్, సికిందరాబాద్, ఎల్బీ నగర్(LB Nagar) జోన్ ల శానిటేషన్ విభాగాన్ని పర్యవేక్షించే బాధ్యతలను కట్టబెట్టారు. కానీ ఈ ఇద్దరు అధికారుల్లో గతంలో జోనల్ కమిషనర్ గా చార్మినార్ జోన్ లో విధులు నిర్వర్తించిన అశోక్ సామ్రాట్ కు శానిటేషన్ పై కాస్త అవగాహన, పట్టు ఉన్నా, కొద్ది నెలలల క్రితమే జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్ గా పోస్టింగ్ దక్కించుకున్న వేణుగోపాల్ రెడ్డి కి ఇప్పటి వరకు సిటీ శానిటేషన్ పై ఎలాంటి అవగాహన లేదు. కానీ ఆయన ఖమ్మం కమిషనర్గా వ్యవహారించిన అనుభవం ఉంది. ఈ ఇద్దరు జాయింట్ కమిషనర్లతో పాటు అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్) రఘుప్రసాద్‌ల పనితీరుతో గ్రేటర్‌లో శానిటేషన్ గాడీన పడుతుందని కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం.

ప్రక్షాళనపై అదనపు కమిషనర్ల అసంతృప్తి?

జీహెచ్ఎంసీ(GHMC)లో భారీ పక్షాళన చేస్తూ, అదనపు కమిషనర్ల సంఖ్యను కుదిస్తూ కమిషనర్ కర్ణన్(RV Karnan) జారీ చేసిన ఆదేశాలపై పలువురు అదనపు కమిషనర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కొందరు అదనపు కమిషనర్లను జాయింట్ కమిషనర్లుగా నియమించటంతో పాటు కొందరు పర్యవేక్షిస్తున్న ముఖ్యమైన విభాగాల నుంచి తప్పించి వేరే సింగిల్ విభాగాలను అప్పగించటంపై కూడా కొందరు అదనపు కమిషనర్లున్నట్లు సమాచారం. ముఖ్యమైన స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్ బాధ్యతలను గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంజనీరింగ్ విభాగానికి కట్టబెడుతూ మెయింటనెన్స్ చీఫ్ ఇంజనీర్ కు కేటాయించారు. హౌజింగ్ విభాగాన్ని కూడా అదనపు కమిషనర్ నుంచి కట్ చేసి, చీఫ్ ఇంజనీర్ హోజింగ్‌కు కేటాయించటంపై కూడా జీహెచ్ఎంసీ(GHMC)లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే పీకల దాక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ విభాగానికి హౌజింగ్, స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ ను అప్పగించటంపై కూడా విమర్శలు తలెత్తుతున్నాయి. కమిషనర్ తీసుకున్న ప్రక్షాళన, అదనపు కమిషనర్ల కుదింపుపై అసంతృప్తిగా ఉన్న కొందరు అదనపు కమిషనర్లు సెలవులపై వెళ్లాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: Anchor Swetcha: పూర్ణ చందర్‌ రిమాండ్‌లో సంచలనం.. బీఆర్ఎస్ కీలక నేత పేరు!

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు