Maoists Surrendered: చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో అధికంగా 8 మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులందరిపై రూ. 23 లక్షల రివార్డు ఉన్నట్లు చత్తీస్గడ్(Chhattisgarh) అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ ఛత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్(Operation Kagar) నేపథ్యంలో పలువురు మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో అందులో పని చేసే వివిధ క్యాడర్ల మావోయిస్టులు అత్యధికంగా లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారు.
కక్షపూరితంగా లొంగిపోయి
ఈ నేపథ్యంలోనే చత్తీస్గడ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాకు చెందిన పోలీసుల ఎదుట మావోయిస్టులు 13 మంది లొంగి పోయారు. అయితే ఇప్పటివరకు ఆపరేషన్ కగార్(Operation Kagar)లో మావోయిస్టులు కక్షపూరితంగా లొంగిపోయిన మావోయిస్టుల కుటుంబాలకు చెందిన వారిని మట్టుపెట్టారు. అంతేకాకుండా నారాయణపూర్ జిల్లాలో 12 మంది లొంగిపోయిన మావోయిస్టులను కిడ్నాప్ చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం అటు అధికారులు కానీ, మావోయిస్టులు గాని పూర్తిస్థాయిలో వెల్లడించకపోవడం గమనార్హం.
ఆపరేషన్ కగార్
అనుకున్న విధంగానే ఆపరేషన్ కగార్(Operation Kaga)r మొదలుపెట్టిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం(Centrel Govt) మావోయిస్టులను మట్టు పెట్టడమే ధ్యేయంగా భద్రత బలగాలను రంగంలోకి దించింది. ఆ క్రమంలోనే కేంద్ర కమిటీ సభ్యులు ఐదుగురిని, రాష్ట్ర కమిటీ సభ్యులు, డివిజన్ కమిటీ సభ్యులు దాదాపుగా 58 మంది వరకు ఎన్కౌంటర్ల(Encounter)లో మృతి చెందారు.
Also Read: Medchal district: భారీ శబ్ధాలు దుమ్ము ధూళితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి.. ఎక్కడంటే!