Medchal district (imagecredit:swetcha)
హైదరాబాద్

Medchal district: భారీ శబ్ధాలు దుమ్ము ధూళితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి.. ఎక్కడంటే!

Medchal district: క్రషర్ మిషన్ వల్ల వచ్చే దుమ్ము, ధూళీతో పాటు క్వారీలలో పెద్ద పెద్ద బ్లాస్టింగ్ శబ్ధాలతో మేడ్చల్(Medchel) జిల్లాలో అనేక గ్రామాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. తమ గ్రామాలను బ్లాస్టింగ్ శబ్ధాలతో పాటు, దుమ్ము, ధూళీ భారి నుంచి కాపాడాలంటూ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్‌కు పలు ప్రాంతాల ప్రజల నుంచి వెల్లువలా ఫిర్యాదులు అందాయి. దీంతో మైనింగ్ అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు

రోగాల భారిన పడుతున్నాం

మేడ్చల్ మండలం రెవిన్యూ పరిధిలోని గిర్మాపూర్, రాయిలాపూర్, బండ మాదారం గ్రామాలలో ఉన్న క్వారీలతో పాటు క్రషర్ మిషన్ల(Crusher Machines) వల్ల మూడు గ్రామాల ప్రజలందరు రోగాల బారిన పడుతున్నామని గ్రామస్థులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్ మిషన్లు క్వారీలలో పరిమితికి మించి చేస్తున్న బ్లాస్టింగ్(Blosting) వల్ల తమ గ్రామాల్లోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా తినే ఆహారంతో పాటు, ఇంట్లోని పాత్రలపై దుమ్ము వచ్చి చేరుతుందన్నారు. జిల్లా మైనింగ్ అదికారి సైదులు, కాలుష్య నియంత్రణ అధికారిని స్వప్న, పలువురు అధికారులు మేడ్చల్ మండలం రెవిన్యూ పరిధిలోని గిర్మాపూర్, రాయిలాపూర్, బండ మాదారం గ్రామాలలో ఉన్న క్వారీలతో పాటు క్రషర్ మిషన్లను పరిశీలించారు. ఈ మూడు గ్రామాల్లోని రాక్ సాండ్, రోబో సాండ్, గెలాక్సి సాండ్ క్రషర్ మిషన్లు చేస్తున్న పరిమితి మించి బ్లాస్టింగ్(Blostings)లు, క్రషర్ మిషన్(Crusher Machines) వల్ల వస్తున్న దుమ్ముతో పాటు పరిమితి మించి టిప్పర్ లలో డస్ట్(Dust) తరలించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

Also Read: TG Govt Schools: గుడ్ న్యూస్.. ప్రభుత్వ స్కూళ్లల్లో భారీగా పెరిగిన విద్యార్థులు.. ఎంతంటే?

మితిమీరిన శబ్దాలు చేసి బ్లాస్టింగ్

రోజంతా దుమ్ములోనే బతకాల్సి వస్తోందని, గ్రామంలోని చాలా మంది రోగాల భారిన పడ్డ ఉదంతాలు కూడా ఉన్నాయన్నారు. క్రషర్ మిషన్లు ఏర్పాటు చేసిన టిప్పర్ లలో 20 టన్నులకు బదులు, 40 టన్నుల డస్ట్, కంకర తీసుకెళ్తున్న సమయంలో రోడ్లపై పడుతోందని, ఆ రోడ్లపై వాహనాలు నడిపినప్పుడు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయని చెప్పారు. మితిమీరిన శబ్దాలు చేసే బ్లాస్టింగ్(Blostin)ల వల్ల ఇళ్ల పై కప్పులు పెచ్చులూడడంతో పాటు, ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతుననాయన్నారు. దీనిపై గ్యాలక్సీ సాండ్ క్రషర్ మిషన్ వారికి చెప్తే ఈ క్రషర్ మిషన్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే(MLA)ది అని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొండని బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రషర్ మిషన్ లపై అధికారులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని మూడు గ్రామాల ప్రజలను కాపాడాని కోరారు.

Also Read: Mini Godowns: ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు 85 గోదాముల బాధ్యతలు!

 

Just In

01

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే