Mini Godowns: రాష్ట్రంలో మినీ గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ గోదాములను నిర్మించి మహిళా సంఘాలకు అప్పగించాలని భావిస్తున్నది. ప్రతీ గోదాం నిర్మాణానికి రూ.15లక్షలు కేటాయిస్తున్నారు. సెర్ప్ గోదాములకు ఫండింగ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 184 మినీ గోదాములను నిర్మిస్తుండగా అందులో 100 గోదాముల నిర్వహణ బాధ్యతలను మండల సమాఖ్యలకు, 84 గోదాములను ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు అప్పగించనున్నారు. నిర్మాణ బాధ్యతలను ఎంజీఎన్ఆర్ఈజీఎస్, సివిల్ సప్లయ్ డిపార్ట్‌మెంట్లకు అప్పగిస్తున్నారు. గోదాముల అవసరమైన నిల్వ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి , వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలను (డీపీఆర్) సిద్ధం చేయడానికి నాబ్ కిసాన్ సంస్థకు అప్పగించారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. సిట్ దూకుడు!
రైతు సంక్షేమానికి మరో చారిత్రాత్మక నిర్ణయం
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. పంటకు గిట్టుబాటు ధర రాని సమయంలో, మధ్య దళారులకు అమ్ముకొని నష్టపోకుండా ఉండేందుకు గ్రామాల్లోనే (Farmers) రైతులకు (Farmers) సౌకర్యవంతంగా ఉండేందుకు, ధాన్యం నిలువ చేసుకునేందుకు వీలుగా మినీ గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్(సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గోదాములకు సంబంధించిన అంచనాలను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 184 మినీ గోదాములు నిర్మించాలని కసరత్తును ప్రారంభించింది.
ఒక్కొక్క గోదాం నిర్మాణం కోసం రూ.15 లక్షలు సెర్ప్ కేటాయించింది. గోదాముల నిర్వహణ బాధ్యతలను మహిళా రైతు సంఘాలు, మండల సమాఖ్యలకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. గోదాముల నిర్మాణం కోసం మండలాల్లో అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించినట్లు సమాచారం. ఒక్కొక్క గోదాములో ఎన్ని క్వింటాల ధాన్యం స్టోరేజీ చేయాలనేదానిపై నాబ్ కిసాన్ సంస్థ డీపీఆర్ (అంచనాలు) రూపొందిస్తున్నది.
గోదాముల నిర్మాణ బాధ్యతలను నాబ్ కిసాన్‌కు అప్పగించారు. ఆయా మండలాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి వీలైనంత త్వరగా గోదాములు నిర్మించేందుకు సెర్ప్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాల కలెక్టర్లు కూడా స్థల సేకరణపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో గోదాముల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా, ఉపాధిహామీ, పౌర సరఫరాల శాఖ అధికారుల సమన్వయంతో వీటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: CM Revanth Reddy: అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి!
184 గోదాములు రూ.2760 కోట్లు
గ్రామీణ ప్రాంతాల్లో గోదాములు లేక రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సీజన్‌లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు లేకపోతే మధ్య దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. వరి ధాన్యం అయితే సీజన్‌లో అమ్ముకోవచ్చు. కానీ, వాణిజ్య పంటలకు మాత్రం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వాటిని నిల్వచేసుకునేందుకు లేక తక్కువ ధరకు అమ్మి నష్టపోతున్న సంఘటనలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో సెర్ప్ ఆధ్వర్యంలో మినీ గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుడుతుంది. సెర్ప్ నిధుల నుంచే గోదాముల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నారు.
రాష్ట్రంలో ఒక్కో గోదాం నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయిస్తున్నారు. మొత్తం 184 గోదాముల నిర్మాణానికి రూ.2760 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని సెర్ప్ అధికారులు అంచనా వేశారు. ఈ నిర్మాణ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. 184 గోదాముల్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు 84 గోదాముల నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 100 గోదాముల బాధ్యతలను మండల సమాఖ్యలకు అప్పగించనున్నారు. ఈ గోదాముల ద్వారా రైతుల ధాన్యాన్ని నిల్వ చేయడం, దాని నాణ్యతను కాపాడటం, మార్కెట్ ధరలకు అనుగుణంగా ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కలుగనుంది. ఈ గోదాములతో మహిళల ఆర్థిక స్వావలంబన, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
త్వరలో నిర్మాణ పనులకు శ్రీకారం
మినీ గోదాముల (Mini godowns) నిర్మాణానికి ఇప్పటికే స్థలాలు గుర్తించిన మండలాల్లో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుండటంతో వారికే మినీగోదాముల (Mini godowns) నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం. రాష్ట్రంలో 31 జిల్లాల్లో మినీ గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుండగా అత్యధికంగా నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్నారు.
ఆదిలాబాద్11, భద్రాద్రి కొత్తగూడెం 04, హనుమకొండ 01, జగిత్యాల 02, జనగాం 03, జయశంకర్ 02, జోగులాంబ గద్వాల 01, కామారెడ్డి 04, కరీంనగర్ 01, ఖమ్మం 08, మహబూబాబాద్ 10, మహబూబ్‌నగర్ 02, మంచిర్యాల 03, మెదక్ 03, మేడ్చల్ 05, ములుగు 01, నాగర్ కర్నూల్13, నల్గొండ 21, నారాయణపేట 03, నిర్మల్ 14, నిజామాబాద్ 11, రాజన్నసిరిసిల్ల 02, రంగారెడ్డి 03, సంగారెడ్డి 08, సిద్ధిపేట 05, సూర్యాపేట 15, వికారాబాద్ 02, వనపర్తి 02, వరంగల్ 05, యాద్రాద్రి జిల్లాలో 01, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 13 గోదాములు నిర్మించనున్నారు.
మహిళలకే నిర్వహణ బాధ్యతలు దివ్య , సీఈవో , సెర్ప్
మహిళలను అన్ని రంగాల్లో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేయూతనందిస్తున్నది. రైతుల (Farmers) సంక్షేమం కోసం మినీ గోదాములను నిర్మిస్తున్నాం. ఆ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించబోతున్నాం. ఒక్కో గోదాం నిర్మాణానికి రూ.15లక్షలు సెర్ప్ ద్వారా కేటాయిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో మొత్తం184 మినీ గోదాములు నిర్మిస్తున్నాం. ఇప్పటికే గోదాముల నిర్మాణాలకు సంబంధించి డీపీఆర్ సైతం సిద్ధమైంది. త్వరలోనే నిర్మాణ పనులు చేపడుతాం.
Also Read: CP Sudheer Babu: 3.5 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ!