Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. దాదాపు 618 నాయకులు, జర్నలిస్టులు, ఇంకా ఇతరుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు గుర్తించగా, వారందరి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmuri Venkat) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజకీయం కోసం బీఆర్ఎస్ (BRS) పాడు పనికి ఒడిగట్టిందని విమర్శించారు.
Also Read: Jurala Project: జూరాలకు పోటెత్తిన వరద.. 13 గేట్లు ఎత్తివేత!
జూబ్లీహిల్స్ పోలీస్ (Jubilee Hills Police) స్టేషన్లోని సిట్ కార్యాలయానికి వచ్చిన బల్మూరి వెంకట్ (Balmuri Venkat) వాంగ్మూలం ఇచ్చారు. బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, విచారణలో భాగంగానే సిట్ అధికారులు తనను పిలిచారని చెప్పారు. రాజకీయాల కోసం ప్రత్యర్థి పార్టీల నాయకులతోపాటు వారి కుటుంబ సభ్యుల ఫోన్ (Phone) సంభాషణలను ట్యాప్ చేయటం దారుణమని వ్యాఖ్యానించారు. తమ సంభాషణలు విని పలు ఇబ్బందులకు గురి చేశారన్నారు. ట్యాపింగ్ చేయించిన వారికి, చేసిన వారికి కుటుంబాలు లేవా అని ప్రశ్నించారు. ఈ పని చేయించిన వారితోపాటు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
నా భార్య ఫోన్ ట్యాప్ చేశారు
టీఎంఆర్ఈఐఎస్ వైస్ ఛైర్మన్ ఫయీం ఖురేషి కూడా సిట్ విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తన ఫోన్ ట్యాప్ (Phone tapping) అయ్యిందని మూడు రోజుల క్రితమే డీసీపీ ద్వారా తెలిసిందన్నారు. తన ఫోన్ తోపాటు తన భార్య, డ్రైవర్ ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పారు. తన వద్ద పని చేస్తున్న డ్రైవర్ ఇప్పటికే సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిపారు. రాజకీయాల్లో ఉన్నా కాబట్టి తన ఫోన్ సంగతి సరే, తన భార్య ఫోన్‌ను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. భార్యాభర్తల వ్యక్తిగత సంభాషణలను వినడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఇంత నీచానికి దిగజారుతారా అని మండిపడ్డారు. ఎన్నికల ముందు తన ఫోన్‌ను ట్యాప్ (Phone tapping) చేసి ఒత్తిడి తీసుకు వచ్చారన్నారు.
Also Read: Kavitha Slams Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం!