CM Revanth Reddy( IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ

CM Revanth Reddy: అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి!

CM Revanth Reddy: కోర్ అర్బన్ రీజియన్ కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర పాలసీ తయారుచేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​ అండ్​ అర్బన్​ డెవెల‌ప్‌మెంట్‌​పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై పూర్తి వివరాలను అధికారులు వివరించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో కొనసాగుతున్న తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్‌ప్లాంట్స్ పనుల ప్రస్తుత పరిస్థితిని తెలిపారు.

 Also ReadMinister Uttam Kumar Reddy: 30న ప్రజా భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్!

ముందస్తు చర్యలు చేపట్టాలి

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్డుపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వానాకాలంలో డ్రైనేజ్ ఓవర్ ఫ్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడటంతో పాటు, దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమగ్ర వివరాలను అందజేయాలి

హెచ్ సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు తెలుపగా, సమగ్ర వివరాలను అందజేయాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలతో రావాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కోర్ అర్బన్‌తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

 Also Read: Kavitha Slams Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!