Pan India | స్టార్‌, స్టార్‌.. మల్టీస్టారర్‌......
Pan India Multistarer Movie Latest News
Cinema

Pan India: స్టార్‌, స్టార్‌.. మల్టీస్టారర్‌…

Pan India Multistarer Movie Latest News: టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్‌ ఇండియా మూవీస్‌ హవా కొనసాగుతోంది. తెలుగులో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో దర్శక ధీరుడు రాజమౌళి మల్టీస్టారర్‌ మూవీస్‌కి ఒక రూట్ క్రియేట్‌ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీలో గ్లోబల్ స్టార్స్‌ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరిద్దరి కాంబినేషన్‌కి ఆడియెన్స్‌ ఫిదా అయిపోయారు. దీంతో టాలీవుడ్‌లో మల్టీస్టారర్ హవా స్టార్ట్ అయింది.

తాజాగా ఇదే దిశగా క్రేజీ మల్టీస్టారర్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. హీరోలు ధనుష్‌, నాగార్జున కలిసి నటిస్తున్న కుబేర మూవీ, బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్‌ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 వంటి మూవీలపై ఆడియెన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఇదిలా ఉంటే మరో క్రేజీ కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. గ్లోబల్ స్టార్‌ రామ్‌చరణ్‌ కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య కాంబినేషన్‌లో బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ మూవీ రాబోతున్నట్లు సోషల్‌మీడియాలో ఓ వార్త తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు శివ సూర్యతో కంగువ మూవీ తెరకెక్కిస్తున్నారు. కంగువ మూవీపై ఆడియెన్స్‌లో భారీ అంచనాలు ఉండటంతో ఈ కాంబో తెరపైకి వచ్చినట్టు సమాచారం. రాంచరణ్‌, సూర్య వంటి బిగ్‌ స్టార్స్‌తో మూవీ చేయడం అంటే అంత ఈజీ కాదు.

Also Read: బోల్డ్ లుక్ తో ఫేట్ మారింది

ఎందుకంటే వారిద్దరి ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని బ్యాలెన్స్‌ చేస్తూ అద్భుతమైన స్టోరీ, స్క్రీన్‌ప్లే కావాలి.. అందుకు తగ్గట్లుగా ఔట్‌పుట్‌ రావాలి. ఇక ఇవన్నీ చూసుకుంటే ఈ కాంబినేషన్‌లో మూవీ రావడం కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రామ్‌చరణ్‌, సూర్య వరుస మూవీస్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీస్ కంప్లీట్‌ అవడానికి చాలా టైమ్‌ పడుతుంది. మరి వారి కమిట్మెంట్‌ని కాదనుకొని ఈ మూవీ చేస్తే తప్ప ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు. మల్టీస్టారర్‌ మూవీ కోసం ఆడియెన్స్‌ అంచనాలను అందుకోవాలంటే కొంత టైమ్ తీసుకొని మరీ.. తెరపైకి ఎక్కించాలి దర్శకులు.

Just In

01

Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి ‘నా పేరు శంబాల’ సాంగ్ రిలీజ్..

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని ఓడినా సరే వారు నాకు సర్పంచులే: జగ్గారెడ్డి

Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?.. నిర్మాత స్పందన ఇదే..

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..