Anupama getting big offers after Tillu Square movie :
క్యూట్ హాట్ లుక్స్ తో కుర్రకారును ఇట్టే ఆకట్టుకునే టిల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా బిజీగా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద నెంబర్ వన్ హీరోయిన్ గా స్థానం దక్కించుకుంది. అంతకు ముందు హిట్ సినిమాలలో చేసినా రానీ పేరు టిల్లు స్స్వేర్ మూవీలో బోల్డ్ గా నటించి ఒక్కసారిగా అభిమాన ప్రేక్షకులను తనవైపునకు తిప్పేసుకుంది. అందుకే ఇప్పుడు బడా నిర్మాతలంతా అనుపమ చుట్టూ తిరుగుతున్నారు అపాయింట్ మెంట్ కోసం. ప్రేమమ్ మూవీతో తెరంగేట్రం చేసిన ఈ మలయాళ ముద్దుగుమ్మ కెరీర్ మొదలుపెట్టి అప్పుడే 9 ఏళ్లు అవుతోంది. దాదాపు దక్షిణాది సినిమాలన్నింటిలో నటించింది.
సీక్వెల్ బ్యూటీ
కార్తికేయ 2 మూవీ బంపర్ హిట్ అవడంతో జాతీయ స్థాయిలో ఈ బ్యూటీకి గుర్తింపు లభించింది. ఆ మూవీ దాదాపు 250 కోట్లు కొల్లగొట్టింది. రీసెంట్ గా టిల్లు స్క్కేర్ వి సూపర్ హిట్ మూవీతో మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. వరుసగా సీక్వెల్స్ మూవీలు హిట్ అవ్వడంతో అనుపమను అంతా సీక్వెల్ బ్యూటీ అంటున్నారు. అయితే ఈ విజయాలతో అనుపమ పరమేశ్వరన్ ఫేజ్ మారింది. . మునుపటితో పోలిస్తే ఈ బ్యూటీలో గ్లామరస్ కంటెంట్ ఎలివేషన్ అదనపు హంగును జోడించింది. ఇటీవలి బాక్సాఫీస్ విజయాల దృష్ట్యా అనుపమ ఆలోచన మారిందని, నటిస్తున్న ప్రతి చిత్రానికి తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదంతా బోల్డ్ లుక్ గేర్ మార్చినందుకే అంటున్నారంతా.