World Asteroid Day (Image Source: Twitter)
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

World Asteroid Day: కనీవినీ ఎరుగని విస్ఫోటనం.. జూన్ 30న ఏం జరిగిందో తెలిస్తే వణికిపోతారు!

World Asteroid Day: చరిత్రలో జూన్ 30వ తేదీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజును ప్రపంచ గ్రహశకల దినోత్సవం జరుపుకుంటారు. 2016లో ఐక్యరాజ్య సమితీ జనరల్ అసెంబ్లీ (United Nations General Assembly) చేసిన తీర్మానం ప్రకారం జూన్ 30 వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే (World Asteroid Day)గా మారిపోయింది. అయితే ఐరాస జూన్ 30వ తేదీనే గ్రహశకల దినోత్సవంగా ప్రకటించడం వెనక పెద్ద కారణమే ఉంది. భూమిపై జరిగిన కనీవినీ ఎరుగని విస్ఫోటనానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ విస్ఫోటనం ఏంటీ? జూన్ 30న ఐరాస ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది? వంటి అంశాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఎందుకు ప్రకటించారు?
ప్రపంచ ఆస్ట్రాయిడ్ డే (International Asteroid Day) ప్రతి సంవత్సరం జూన్ 30వ తేదీన జరుపుకుంటారు. 1908లో సరిగ్గా ఇదే రోజున సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతంలో పెను విస్ఫోటనం చోటుచేసుకుంది. దీనిని తుంగుస్కా ఘటనగా (Tunguska Event) పిలుస్తారు. ఖగోళం నుంచి దూసుకొచ్చిన అతిపెద్ద అస్ట్రాయిడ్ ఆ ప్రాంతాన్ని ఢీ కొట్టింది. దీని వల్ల తుంగుస్కాలో భారీ పేలుడు సంభవించింది.. వేలాది ఎకరాల అడవి నాశనమైంది. తీరని నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో గ్రహశకలాలపై అవగాహన కల్పించడం, వాటి నుంచి భూమిని రక్షించే సాంకేతికతను ప్రోత్సహించే క్రమంలో జూన్ 30వ తేదీని అస్ట్రాయిడ్ డేగా ఐరాస ప్రకటించింది. 2014లోని దీనికి సంబంధించిన ఆలోచన రాగా.. తొలుత ఖగోళ శాస్త్రవేత్తలు, నిపుణులు, సినీ నటుడు బ్రియాన్ కాక్స్, డాక్టర్ గ్రిగ్ రిచ్‌మాన్ వంటి వ్యక్తులతో కమిటీ ఏర్పాటైంది. వారు చేసిన సూచనల మేరకు 2015లో మొదటి ఆస్ట్రాయిడ్ డే అనధికారికంగా నిర్వహించారు. 2016లో ఐక్యరాష్ట్ర సమితి దీనిని అధికారికంగా గుర్తించింది.

తుంగుస్కా సంఘటన (1908)
1908 జూన్ 30న జరిగిన తుంగుస్కా ఘటన లోతుల్లోకి వెళ్తే.. ఆ రోజు తుంగుస్కా నది సమీపంలో ఒక భారీ ఆస్ట్రాయిడ్ పడింది. దీని వ్యాసం దాదాపు 50-100 మీటర్ల వరకూ ఉంటుంది. భూ వాతావరణంలోకి ప్రవేశించగానే గ్రహశకలం ఒక్కసారిగా పేలిపోయింది. అగ్నికీలల ధాటికి 2,000 చదరపు కిలోమీటర్ల అడవి ధ్వంసమైంది. సుమారు 80 మిలియన్ చెట్లు నేలమట్టం అయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ సంఘటన జనావాసం లేని ప్రాంతంలో జరగడంతో ప్రాణ నష్టం తక్కువగా జరిగింది. ఈ ఘటన ఆస్ట్రాయిడ్‌ల వల్ల కలిగే ముప్పును యావత్ ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఈ క్రమంలోనే ఆస్ట్రాయిడ్ లను కదలికలను ముందుగానే గుర్తించడం, ట్రాక్ చేయడం, వాటి మార్గాలను మార్చే సాంకేతికతలు ప్రపంచంలో అందుబాటులోకి వచ్చాయి.

Also Read: Congress vs BJP: డీఎస్ విగ్రహావిష్కరణపై వార్.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్.. ఎందుకంటే?

2029 ఏడాదికి ప్రత్యేక గుర్తింపు
మరోవైపు 2029ని అంతర్జాతీయ గ్రహశకల అవగాహన సంవత్సరం (International Year of Asteroid Awareness) గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ ఏడాదిలో 99942 అపోఫిస్ అనే గ్రహశకలం (Asteroid 99942 Apophis) భూమికి దగ్గరగా రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 13, 2029న అపోఫిస్ భూమి ఉపరితలానికి చేరువగా రానుంది. భూమికి సుమారు 32,000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనుంది. యూరప్, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా దేశాల ప్రజలు.. ఈ ఆస్ట్రాయిడ్ ను చూడవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు అపోఫిస్ దాదాపు 340 మీటర్ల వ్యాసం కలిగి మూడు ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉండనుంది. ఇది ప్రస్తుతం ప్రతి 323 రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతోంది.

Also Read This: BRS Party Membership: గులాబీలో ఒకటే సస్పెన్స్.. నాలుగేళ్లుగా క్లారిటీ మిస్సింగ్.. కన్ఫ్యూజన్‌‌లో క్యాడర్!

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?