BRS Party Membership (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

BRS Party Membership: గులాబీలో ఒకటే సస్పెన్స్.. నాలుగేళ్లుగా క్లారిటీ మిస్సింగ్.. కన్ఫ్యూజన్‌‌లో క్యాడర్!

BRS Party Membership: గులాబీ పార్టీ సభ్యత్వంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అసలు ప్రారంభిస్తారా? లేదా? అనే చర్చ పార్టీలో చర్చకు దారితీసింది. అక్టోబర్ పార్లమెంట్ ప్లీనరీ నిర్వహించే అవకాశం ఉందని ఇప్పటికే పార్టీ అధిష్టానం పేర్కొంది. ఈ తరుణంలో అసలు ఎప్పుడు సభ్యత్వ నమోదు ప్రారంభిస్తారు? ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు? ఎప్పుడు గ్రామస్థాయి నుంచి కమిటీలు వేస్తారు? ప్లీనరీ ఎలా సిద్దమవుతారు? అనేది విస్తృత చర్చ జరుగుతున్నది. జూన్‌లోనే సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుందని పార్టీ లీకులు ఇచ్చినా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం లేదని, పార్టీ నేతలు సైతం మారడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.


నెలలు గడుస్తున్నా నో క్లారిటీ
బీఆర్ఎస్ పార్టీ ఈ ఏడాది ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో సభ నిర్వహించింది. సక్సెస్ చేసింది. అయితే అదే జోష్‌తో ప్రజల్లోకి వెళ్లాలని భావించింది. పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తారని పార్టీ పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది పార్టీ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. తొలుత సభ్యత్వ నమోదు చేస్తామని, ఆ తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు కమిటీలు వేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రకటించారు. గతంకంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి బీఆర్ఎస్ పార్టీ రికార్డు సృష్టిస్తుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే నెలలు గడుస్తున్నా అడుగు ముందుకు పడడం లేదు. పార్టీ సభ్యత్వ నమోదు తేదీని ప్రకటించడం లేదు. కేటీఆర్ సైతం ఈ నెల 20న లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 30న తిరిగి హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన వచ్చిన తర్వాత సభ్యత్వ నమోదును ప్రారంభిస్తారా? లేదా? అనే ప్రచారం ఊపందుకున్నది. అయితే, ఈ సభ్యత్వ నమోదుతో ప్రజల దగ్గరకు వెళ్లొచ్చని, ప్రభుత్వ వ్యతిరేకతను వివరించి ఆకట్టుకోవచ్చని నేతలు భావిస్తున్నారు. పార్టీ మాత్రం నమోదు ఎప్పటి నుంచి చేపడుతుందనేదానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో కొంత నైరాశ్యానికి గురవుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టత ఇవ్వకపోవడంతోనే జాప్యం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. ఎప్పుడైనా అక్టోబర్‌లో ప్రతినిధుల సభ(ప్లీనరీ) నిర్వహిస్తామని ఇప్పటికే పార్టీ నేతలు తెలిపారు. అయితే, ఏయే ప్రణాళికలతో పార్టీ ముందుకు పోతుందనేది పార్టీలో ఆసక్తికర చర్చ ఊపందుకున్నది.

డిజిటల్ పద్దతిలో సభ్యత్వ నమోదు
బీఆర్ఎస్ పార్టీ ప్రతి రెండేళ్ల ఒకసారి పార్టీ సభ్యత్వ నమోదు చేయాల్సి ఉంది. అయితే పార్టీ మాత్రం 2021లో సభ్యత్వ నమోదు చేపట్టింది. 60లక్షల సభ్యత్వాలు నమోదు చేశామని, ఒక ప్రాంతీయ పార్టీ ఇంత పెద్దమొత్తంలో సభ్యత్వాలు రికార్డు అని కేటీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత చేయలేదు. 2023లో పాత సభ్యత్వ నమోదును చేయాల్సి ఉండగా రెన్యూవల్ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగించినట్లు పార్టీ నేతలు తెలిపారు. వరుస ఎన్నికల నేపథ్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను కొనసాగించలేదని పార్టీ అధిష్టానం పేర్కొంది. సభ్యత్వ నమోదు చేసి గ్రామస్థాయి నుంచి కమిటీలను సైతం వేయాల్సి ఉండడంతో పాటు అక్టోబర్‌లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తికావాల్సి ఉంది. ఇందుకు ప్రణాళిక బద్దంగా పార్టీ ముందుకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఇంకా పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ తొలిసారిగా డిజిటల్ పద్దతిలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టబోతుంది. ప్రతి వ్యక్తి వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో పొందుపర్చనున్నారు. గతంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా సభ్యత్వ నమోదు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


బాధ్యతలు ఎవరికి
పార్టీ సభ్యత్వ నమోదు బాధ్యతలను ఎవరికి అప్పగించబోతున్నారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగిస్తారా, మరెవరికైనా అప్పగిస్తారా, లేకుంటే ఒక కమిటీ వేసి పర్యవేక్షణ చేయిస్తారా అనేది ఆసక్తి కరంగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది పార్టీ నేతలు సైతం ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ చేతుల మీదుగానే సభ్యత్వ నమోదు కార్యక్రమం జూలైలో ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. దీంతో ద్వితీయశ్రేణి నాయకులను పట్టించుకోలేదు. నియోజకవర్గాల్లో పాత, కొత్త అనే విధంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. సహకారం కరువైంది, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఓటమికి ప్రాధానకారణమైందని పార్టీ సైతం గుర్తించింది. అయితే, ఇప్పటికి కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎలా విజయవంతం చేస్తారనేది ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యేలు గానీ, పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చెబితే కిందిస్థాయి నేతలు సభ్యత్వం చేస్తారా? అనే చర్చ జరుగుతుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దూరంపెట్టడంతో ఇప్పుడు సభ్యత్వం అంటే ఎలా చేస్తారని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇన్‌ఛార్జ్‌లు చెబితే నేతలు వినే పరిస్థితి కూడా లేదు. పార్టీ జోక్యం చేసుకొని సందేశం ఇస్తే తప్ప సభ్యత్వం సక్సెస్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Damodar Raja Narasimha: హై ప్రయారిటీ లిస్ట్‌లో హెల్త్.. సర్కారు ప్లాన్ అదుర్స్

పార్టీని స్ట్రాంగ్ చేయాలంటే కమిటీలు కీలకం
బీఆర్ఎస్ పార్టీ 2017లో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో రాష్ట్ర కమిటీని ప్రకటించింది. ఆ కార్యవర్గమే కొనసాగుతుంది. నూతన కార్యవర్గం ప్రకటించలేదు. కొంతమంది ఈ కార్యవర్గంలో ఉన్న సభ్యులు పార్టీ మారారు. దీంతో పార్టీలో కొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి. అయినప్పటికీ అధిష్టానం భర్తీ చేయలేదు. 2021లో పార్టీ సంస్థాగత కమిటీలను వేసింది. సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు 15 మంది సభ్యులతో కూడిన గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక తదితర పార్టీకి అనుబంధాలైన 14 సంఘాలను నియమించింది. అదే నెల 13 నుంచి 20వ తేదీ వరకు మండల స్థాయిలో కమిటీలను వేసింది. 2022 జనవరి 26న పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యవర్గాలను, అనుబంధ కమిటీలను నియమించలేదు. 2023లో డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్లీనరీ సైతం నిర్వహించలేదు. కమిటీలపై దృష్టిసారించలేదు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. పార్టీని బలోపేతం చేయాలంటే నాయకులను, కార్యకర్తలను యాక్టివ్ చేయాలంటే రాబోయే ఎన్నికల వరకు పార్టీని స్ట్రాంగ్ చేయాలంటే కమిటీలు కీలకం. క్యాడర్‌కు బాధ్యతలు అప్పగిస్తే తప్ప పార్టీ బలోపేతం అయ్యే అవకాశం లేదు. ఈ తరుణంలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టడంతో కమిటీలు చేయాల్సి ఉంది. అయితే, పార్టీ అధిష్టానం ఎప్పటి నుంచి శ్రీకారం చుడుతుందో చూడాలి.

Also Read This: Telangana BJP: కమల దళపతి నియామకానికి చకచకా ఏర్పాట్లు

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!