India Pakistan
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Pakistan: పాక్‌‌లో భారీ ఉగ్రదాడి‌.. ప్రకటన విడుదల చేసిన భారత్

Pakistan: పాకిస్థాన్ ఆర్మీ లక్ష్యంగా ఆ దేశంలోని వజీరిస్థాన్‌లో శనివారం ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసింది. దీని వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ ఆర్మీ నిందవేసింది. ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. పాక్ చేసిన ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘జూన్ 28న వజీరిస్థాన్‌లో జరిగిన దాడికి భారతదేశంపై నిందలు వేస్తూ పాకిస్థాన్ ఆర్మీ అధికారిక ప్రకటన చేయడం మా దృష్టికి వచ్చింది. ఈ ప్రకటనపై మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు.

Read this- Rath Yatra: జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. తీవ్ర విషాదం

కాగా, శనివారం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన ఒక వాహనం వచ్చి ఆర్మీ కాన్వాయ్‌ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఈ ఘటనలో మరో 19 మంది పౌరులు గాయాలయ్యాయని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలోని స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ‘ఫిట్నా-అల్-ఖవారీజ్’ ఈ దాడికి పాల్పడినట్టుగా పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, భారత్‌పై నిందవేసేందుకు పాకిస్థాన్ ఆర్మీ ప్రయత్నిస్తోంది.

Read this- Star Actress: ఆ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

దక్షిణ వజీరిస్థాన్‌లో ఇటీవలే మరో ఇద్దరు పాక్ సైనికులు మరణించారు. ఆ తర్వాత, 11 మంది ఉగ్రవాదులను పాక్ బలగాలు హతమార్చాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆత్మాహుతి దాడి జరిగిందని ‘డాన్ పత్రిక’ కథనం పేర్కొంది. అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటన విడుదల చేయలేదు. కాగా, 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దేశానికి సరిహద్దులో ఉండే పాకిస్థాన్ ప్రాంతాలలో హింస గణనీయంగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పాక్‌లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను తాలిబన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ఈ రెండు ప్రావిన్సూల్లోనూ పాక్ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులు ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ గ్రూపులు జరిపిన దాడుల్లో సుమారు 290 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది చనిపోయి ఉంటారని అంచనాగా ఉంది.

Read this- Telangana BJP President: చివరి దశకు బీజేపీ స్టేట్ చీఫ్ నియామకం.. నేడు నోటిఫికేషన్

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..