Telangana BJP President (imagcredit:twitter)
Politics

Telangana BJP President: చివరి దశకు బీజేపీ స్టేట్ చీఫ్ నియామకం.. నేడు నోటిఫికేషన్

Telangana BJP President: తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నో రోజుల సస్పెన్స్‌కు వచ్చేనెల తెరపడనుంది. జూలై 1వ తేదీన స్టేట్ చీఫ్ నియామకం చేపట్టనున్నారు. కాగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. కాగా సోమవారం నామినేషన్లకు అవకాశం కల్పించనున్నారు. జూలై 1వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా ఓటర్ లిస్టు తయారీపై బీజేపీ(BJP) ఎన్నికల విభాగం నిమగ్నమైంది. దీనికి రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే స్టేట్ చీఫ్ గా ఎవరిని ఫైనల్ చేస్తారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే స్టేట్ చీఫ్(State Chief)​ రేసులో పలువురు నేతలున్నారు. కాగా అందులో ప్రధానంగా ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) పేరు ముందు నుంచే వినిపిస్తోంది. కాగా మరో ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Aravind) సైతం సైలెంట్ గా హైకమాండ్ వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(MP Lxman) పేరు రావడంతో స్టేట్ చీఫ్​ఎవరవుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

జూలై 1వ తేదీన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం

ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ(Telangana )కు సైతం రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన చేసేలా హైకమాండ్ పావులు కదుపుతోంది. కాగా ఈనెల 30న లేదా 1వ తేదీన రాష్ట్రానికి సంస్థాగత ఎన్నికల రాష్ట్ర ఇన్న చార్జీ శోభా కరంద్లాజే తెలంగాణకు రానున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి జూలై 1వ తేదీన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే బూత్ స్థాయి, మండల, జిల్లాల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కాగా స్టేట్ చీఫ్ నియామకంపై ఏడాదిగా కొనసాగుతున్న సస్పెన్స్ కు సైతం తెరదించే పనిలో పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జాతీయ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నికపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఒక్కో పార్లమెంట్ నుంచి ఒకరిని జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

Also Read: Beggar Free City: బెగ్గర్ ఫ్రీ సిటీ కోసం జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్

దాదాపు ఖరారైందనే టాక్

ఇక తెలంగాణ కమల దళపతిగా రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు(N, Ramchendar Rao) పేర్లు ముందు నుంచే వినిపిస్తున్నాయి. అయితే అధిష్టానం మాత్రం ఈటల రాజేందర్ కు కాషాయ పార్టీ పగ్గాలు అందించనుందని, దాదాపు ఖరారైందనే టాక్ గతంలో నుంచే బలంగా వినిపిస్తోంది. అయితే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో అర్వింద్ ఆశలు సన్నగిల్లాయని టాక్. ఈ తరుణంలో అనూహ్యంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్​పేరు తెరమీదకి రావడం గమనార్హం. కాగా లక్ష్మణ్ మాత్రం దీనికి ఏమాత్రం ఆసక్తిగా లేరని విశ్వసనీయ సమాచారం. ఆయన కేంద్ర మంత్రి అవ్వాలనే టార్గెట్‌తో ఉన్న నేపథ్యంలో ఆయన పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఓబీసీ మోర్చాకు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ తిరిగి స్టేట్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడంపై ఇంట్రెస్ట్ కనబరచడం లేదని తెలుస్తోంది.

కొత్త పాత నేతల మధ్య పెద్ద కోల్డ్ వార్

తెలంగాణ కాషాయ రథసారథి అంశంపై కొత్త, పాత నేతల మధ్య పెద్ద కోల్డ్ వార్ జరిగింది. పాత నేతకే ఇవ్వాలంటూ పార్టీలో సీనియర్లు, కొత్తవారికే ఇవ్వాలంటూ వారి అనుచరులు ఎవరికి వారుగా పట్టుపట్టారు. ఈనేపథ్యంలో పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. కాగా స్టేట్ చీఫ్ ఎంపికపై మరోసారి చర్చకు రావడంతో పాత నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? లేక కొత్త వారికి ఇచ్చి కొత్త ట్రెండ్ కు కమలం పార్టీ శ్రీకారం చుడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణను బీజేపీ పాలన సౌలభ్యం కోసం 38 జిల్లాలుగా విభజించుకుంది. కాగా ఒక్కో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి రాష్ట్ర కమిటీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. కాగా ఈ స్టేట్ చీఫ్ నియామకంలో 119 మంది కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లాల అధ్యక్షులు, 17 మంది జాతీయ కమిటీ కౌన్సిల్ సభ్యులు కలిసి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కేంద్ర కమిటీ కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు. టీబీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడి నియామకాన్ని ఏకగ్రీవం చేయాలని హైకమాండ్ ముందు నుంచే భావిస్తోంది. కానీ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎవరూ కాంప్రమైజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదని వినికిడి. ఈలెక్కన స్టేట్ చీఫ్ నియామకానికి ఎన్ని నామినేషన్లు వస్తాయనేది చూడాలి. ఈసారైనా స్టేట్ చీఫ్ నియామకంపై పార్టీ క్లారిటీ ఇస్తుందా? గతంలో మాదిరిగానే ఊరించి ఊదరగొడుతుందా? అనేది చూడాలి.

Also Read: IAMC: ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ భూములా?.. అదికూడా ప్రైమ్ ఏరియాలో..

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు