Star Actress:  ఆ నిర్మాత దారుణంగా ప్రవర్తించాడు.. ఏడ్చాను?
Star Actress ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Star Actress: ఆ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

Star Actress: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది నటీమణులు బహిరంగంగా మాట్లాడారు. యంగ్ హీరోయిన్స్ నుంచి సీనియర్ హీరోయిన్స్ వరకు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించారు. తాజాగా, ఓ స్టార్ హీరోయిన్ కూడా దీని గురించి ఓపెన్ గా మాట్లాడి, షాకింగ్ విషయాలను పంచుకుంది. ఓ నిర్మాత చేసిన అవమానకరమైన ప్రవర్తన వల్ల తాను ఆరు నెలల పాటు వేదన, బాధను అనుభవించానని, ఆ సీనియర్ నటి ఎమోషనల్‌ అయి నమ్మలేని నిజాలను బయట పెట్టింది. అయితే, ఆ అందాల నటి ఎవరు? ఆమెను అంతలా బాధ పెట్టిన నిర్మాత ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Hanamkonda News: రాష్ట్రంలో ఘోరం.. మహిళను వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి.. అతి దారుణం!

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గా పేరు తెచ్చుకున్న విద్యా బాలన్, తెలుగు ఆడియెన్స్ కూడా ఈమె సుపరిచితురాలు. ఇక ఆమె నటించిన డర్టీ పిచ్చర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విద్యా నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీ తర్వాత, బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు మూవీలో కూడా నటించి మెప్పించింది.

 

vidya (Image Source: inastagram)
vidya (Image Source: inastagram)

 

Also Read: Kuberaa: కుబేర సినిమాలో రష్మిక డబ్బు బ్యాగ్ ఎక్కడ ఉంది? శేఖర్ కమ్ముల సమాధానం చెప్పాల్సిందే?

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్న విద్యా బాలన్, తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓ నిర్మాత తనను అవమానకరంగా పిలిచి, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించింది. “ఒక సినీ నిర్మాత నా దగ్గరకు వచ్చి చాలా దారుణంగా, అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఆ అవమానం కారణంగా ఆరు నెలల పాటు వేదనతో నలిగిపోయా.. ఆ మాటల వల్ల ఎవరికీ చెప్పుకోలేక నరకం అనుభవించాను. ఆ సంఘటన నన్ను చాలా కుంగదీసింది. నా కెరీర్‌లో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ” అని విద్యా బాలన్ బాధతో చెప్పుకొచ్చింది. అలాగే, తనపై బాడీ షేమింగ్ కూడా చేశారని ఆమె తెలిపింది. అదే సమయంలో మలయాళంలో ఓ మూవీ ఆఫర్ వచ్చింది. కానీ, ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయిందని ఏమోషనల్ అవుతూ చెప్పింది.

Also Read: Kannappa Movie: బ్రేకింగ్.. కన్నప్ప పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. మంచు విష్ణు పై కేసు పెడతామంటూ వార్నింగ్

Just In

01

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?