Kuberaa ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kuberaa: కుబేర సినిమాలో రష్మిక డబ్బు బ్యాగ్ ఎక్కడ ఉంది? శేఖర్ కమ్ముల సమాధానం చెప్పాల్సిందే?

Kuberaa: నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ (Love Story) మూవీ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరక్షన్లో ‘కుబేర’ (Kuberaa) మూవీ జూన్ 20న విడుదలైంది. ధనుష్ (Dhanush) హీరోగా నటించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున దీపక్ అనే ముఖ్య పాత్ర పోషించాడు. ధనుష్ (Dhanush) కెరీర్లో ఇలాంటి పాత్ర పోషించ లేదు. నిజం చెప్పాలంటే.. బిచ్చగాడి పాత్ర అదరగొట్టాడు. ఇక నాగార్జున (Nagarjuna) అయితే సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేశాడనే చెప్పుకోవాలి. ‘ఏషియన్ సినిమా సినిమాస్’, ‘అమిగోస్ క్రియేషన్స్’ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల కలిసి ఈ సినిమాని నిర్మించారు.

సినిమా హిట్ తెచ్చుకున్నా కూడా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా, శేఖర్ కమ్ముల ఎన్నడూ లేని విధంగా ఎన్నో తప్పులు చేసాడంటూ జనాలు కూడా ఏకి పారేస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వక ముందు ఒకటి, రిలీజ్ అయ్యాక  మనకి చూపించేది ఒకటి. రష్మిక విషయంలో కూడా ఇదే జరిగింది. మనకి సినిమా రిలీజ్ అవ్వక ముందు డబ్బు బ్యాగ్ కోసం తవ్వుతున్న వీడియోని ముందు చూపించి, సినిమా విడుదలయ్యాక ఆ సీన్ ఎక్కడా  కనిపించింది లేదు.

ట్రోలర్స్ ఇదే టైమ్ అనుకుని, ఆ వీడియోని షేర్ చేసి, మీలో ఎవరైనా ఈ సీన్ ను చూశారా ? మాకు ఐతే ఎక్కడా కనిపించ లేదని కామెంట్స్ చేస్తున్నారు. మీరు  ఇలా రష్మిక సీన్స్ డిలీట్ చేస్తే, ఆమెను  దారుణంగా అవమానించినట్లే అంటూ  శేఖర్ కమ్ముల పై ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!