Hydraa Commissioner: ఏ మాత్రం వర్షం(Rain) కురిసినా, ఎక్కడా కూడా ముంపు ఏర్పడకుండా, నివారణకు హైడ్రా(Hydra) సంబంధిత శాఖలన్నింటితో సమన్వయాన్ని పెంపొందించుకునే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసుల(Traffic Police)కు హైడ్రా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. రహదారులు నీట మునగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) సమావేశంలో సూచించారు. సమస్య ఎలా పరిష్కారం అవుతుందనే అంశంపై స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించిన శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తే సమస్యను చాలా వరకు పరిష్కారం చేయగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ(GHMC)తో కలసి పని చేస్తున్న హైడ్రా(Hydra) ట్రాఫిక్ పోలీసు ఉన్నతాదికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసింది. జాయింట్ సీపీలు గజరావు భూపాల్(CP Gajarao Pla), జోయిల్ డేవిస్, హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వి. పాపారావుతో పాటు హైడ్రా, ట్రాఫిక్ పోలీసు విభాగాలకు సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా వరద నీట మునిగిన ప్రాంతాలలో తలెత్తుతున్న సమస్యలను అధికారులు వివరించారు. రెండు గంటల పాటు వర్షం పడితే ఒక మీటరు ఎత్తున నీరు చెరువుల్లో చేరుతోందని, ఇంతే మొత్తం వాటర్ బయటకు వెళ్లాలంటే వారం రోజులు పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో వరదను నిలువరించే చెరువుల నీటి మట్టంపైనా అధ్యయనం చేయాల్సిన అవసరముందని హైడ్రా కమిషనర్ సూచించారు.
Also Read: Duvvada: అవును తప్పే.. క్షమించండి పవన్ కళ్యాణ్!
నీట మునుగుతున్న ప్రాంతాలు 349
నగరంలో హైదరాబాద్(Hyderabad), రాచకొండ(Rachakonda), సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 349 ప్రాంతాలలో వరద ముప్పు పొంచి ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రెయిన్ అలర్ట్(Rain Alert) రాగానే, ఈ ప్రాంతాలలో సంబంధిత శాఖల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ఈ ప్రాంతాలకు దగ్గరలో చెరువులు, నాలాలు అనుసంధానమై ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించాలన్నారు. వరద కాలువలు ఎక్కడైనా కుంచించుకుపోయినా, పూడ్చుకు పోయినా ఆ సమాచారం ఇస్తే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ, చికోటీ గార్డెన్స్, చింతలబస్తీల మీదుగా సాగే వరద కాలువలను విస్తరిస్తున్నామని చెప్పారు. చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే వెంటనే తొలగించాలని కోర్టులు స్పష్టమైన తీర్పులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
3 రోజుల్లో ఎమర్జన్సీ బృందాలు రెఢీ
హైడ్రా ఏర్పాటు చేస్తున్న 51 డిజాస్టర్ రెస్పాన్స్(Disaster Response Team) బృందాలకు తోడు 150 మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లు కూడా 3 రోజుల్లో తోడ కానున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) తెలిపారు. సర్కిళ్ల వారీ జీహెచ్ఎంసీ(GHMC) సిబ్బందితో కలిసి ఈ బృందాలు పని చేస్తాయన్నారు. వీటికి జలమండలి, ట్రాఫిక్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలకు చెందిన సిబ్బంది కూడా తోడైతే నగరానికి వరద ముప్పు చాలా వరకు తగ్గించవచ్చునన్నారు. 50 మేజర్ సమస్య ఉన్న ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి తొలుత ప్రయత్నం చేయనునట్లు వెల్లడించారు. రెయిన్ అలర్ట్ తో పాటు సమస్యల పరిష్కారానికి తీసుకునే చర్యలు సమన్వయంతో సాగేందుకు వీలుగా వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్రేక్‌డౌన్ అవుతున్న వాహనాలను పక్కకు తీయడానికి తగిన వాహనాలను ప్రాంతాలవారీ సమకూర్చుకోవాలని ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీలను కోరారు. నగరంలో ఏ ప్రాంతాల్లో వరద ముప్పు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయో వివరించారు.
Also Read: Viral News: ఆమె పంట పడింది.. రెండేళ్లుగా వెతుకుతున్నది దొరికింది