Viral News: ఎవరికైనా కాలం కలిసి రావాలి. అప్పుడే తలరాతలు మారిపోతాయి. దరిద్రం ఆమడ దూరం పారిపోతుంది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన సావిత్రి బాయి సిసోడియా అనే మధ్యవయస్కురాలిని లక్ష్మీదేవి వరించింది. కార్మికురాలిగా పనిచేస్తున్న ఆమెకు ఏకంగా 2.69 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. గనిని లీజుకు తీసుకొని వజ్రాల అన్వేషణ చేస్తున్న ఆమెకు సోమవారం వజ్రం (Viral News) దొరికింది. సావిత్రి బాయి గత రెండేళ్లుగా ఒక ప్రైవేట్ గనిలో వజ్రాల కోసం అన్వేషిస్తోంది. ఎండలు, దుమ్ము, ధూళిని సైతం లెక్కచేయకుండా అన్వేషణ కొనసాగించింది. కుటుంబ అదృష్టాన్ని మార్చాలనే లక్ష్యంతో ఆమె కష్టపడి వెతికింది.
ఎట్టకేలకు సోమవారం (జూన్ 23) వజ్రం దొరకడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీసుకెళ్లి ‘పన్నా డైమండ్ ఆఫీసు’లో డిపాజిట్ చేసింది. ఈ విషయాన్ని డైమండ్ ఆఫీస్ అధికారి అనుపమ్ సింగ్ వెల్లడించారు. వజ్రాన్ని వేలం వేస్తామని ఆయన చెప్పారు. వేలంలో వచ్చిన మొత్తంలో ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని సావిత్ర బాయికి అందిస్తామని వివరించారు.
కాగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది చిన్న పరిమాణంలో భూమిని నామమాత్రపు ధరలకు సామాన్యులకు లీజుకు ఇస్తుంది. వజ్రాల కోసం అన్వేషించే వేలాది మంది భూమిని లీజుకు తీసుకుంటున్నారు. అయితే, వారిలో చాలా కొద్దిమంది మాత్రమే వజ్రాలు లభిస్తాయి.
Read this- Rinku Singh: నిశ్చిత్తార్థం తర్వాత పెళ్లిపై రింకూ సింగ్ కీలక నిర్ణయం
భూమిని లీజుకు తీసుకునే చిన్నపాటి మైనర్లు చలాన్ రూపంలో ప్రభుత్వానికి రూ. 250 నుంచి రూ. 350 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక ఫారమ్‌లో వివరాలు నింపాల్సి ఉంటుంది. కాసేపు వేచిచూస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి 25×30 అడుగుల ప్లాట్‌ను కేటాయిస్తారు. ఆ స్థలానికి మార్క్ చేసి ఇస్తారు. నిర్దేశిత కాలపరిమితి వరకు మైనర్లు అందులో వజ్రాలు వెతకవచ్చు. గడువు వరకు వజ్రాల అన్వేషణపై వారికే హక్కులు ఉంటాయి. ఓ అధికారి స్పందిస్తూ, వజ్రం విలువు ఎంతో ఉంటుందో చెప్పలేమని పేర్కొన్నారు. ‘‘వజ్రాన్ని వేలంలో పెడతారు. ఎంత రేటు పలుకుతుందనేది వేలంలో తెలుస్తుంది. పన్నా జిల్లా దేవేంద్ర నగర్‌కు చెందిన సావిత్రి బాయి సిసోడియాకు వజ్రం దొరికింది’’ అని సదరు అధికారి వివరించారు.
‘‘ప్రభుత్వం కేటాయించిన స్థలంలో వజ్రాలు దొరికితే సంబంధిత వ్యక్తులు వాటిని తీసుకెళ్లి ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో డిపాజిట్ చేయాలి. వజ్రాన్ని పరిశీలించి వేలంలో విక్రయిస్తారు. రాయల్టీలు, పన్నులు మినహాయించిన తర్వాత మిగిలిన డబ్బుని మైనింగ్ చేసిన వ్యక్తులకు అందిస్తారు. రాయల్టీ, ట్యాక్సులు కాస్త బాధ కలిగించినా, శ్రమించి తవ్వకాలు జరిపిన వారికి ప్రయోజనం దక్కుతుంది’’ అని పేర్కొన్నారు. సావిత్రి భాయి వజ్రం దొరకడానికి ముందు దిలీప్ మిస్త్రీ అనే కార్మికుడికి గతేడాది నవంబర్ నెలలో 7.44 క్యారెట్ల వజ్రం దొరికింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే అతడికి లభించిన రెండవ వజ్రం ఇది. 2024 జులై నెలలో కూడా ఒక కార్మికుడికి 19.22 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో, పన్నా వజ్రాలకు విస్తృత ప్రచారం లభించింది.
Read this- Srikanth Arrest: హీరో శ్రీరామ్ అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం