Rinku Sing
Viral, లేటెస్ట్ న్యూస్

Rinku Singh: నిశ్చిత్తార్థం తర్వాత పెళ్లిపై రింకూ సింగ్ కీలక నిర్ణయం

Rinku Singh: టీమిండియా టీ20 ఫార్మా్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ పెళ్లిపై కీలక అప్‌డేట్ వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో ‌ఈ ఏడాది నవంబర్ 19న జరగాల్సిన వివాహాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో టీమిండియాకు క్రికెట్ షెడ్యూల్ ఖరారవ్వడంతో రింకూ సింగ్ కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రింకూ సింగ్ వివాహం 2026 ఫిబ్రవరిలో జరుగుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఖచ్చితమైన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని బంధువు ఒకరు తెలిపినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘‘ ముందుగా నిర్ణయించినట్టుగా 2025 నవంబర్ 19న వారణాసిలోని తాజ్ హోటల్‌ను బుక్ చేసుకున్నాం. అయితే, భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ ఉండడంతో రింకూ వివాహాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి నెలాఖరుకు హోటల్‌ను బుక్ చేశాం. అయితే, ఖచ్చితమైన తేదీ ఇంకా ఖరారు కాలేదు’’ అని వివరించారు.

కాగా, జూన్ 8న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో రింకూ సింగ్ – ఎంపీ ప్రియా సరోజ్‌ జంటకు నిశ్చితార్థం జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, నటి జయా బచ్చన్, టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ వంటి ప్రముఖులు కూడా అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు.

Read this- Srikanth Arrest: హీరో శ్రీకాంత్ అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం

ఎంగేజ్‌మెంట్ ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేసిన రింకూ సింగ్.. ‘‘నేడు జరిగిన వేడుక దాదాపు మూడేళ్లుగా మా హృదయాల్లో ఉంది. ఈ నిరీక్షణలో ప్రతి క్షణమూ మాకు విలువైనదే. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఎంగేజ్‌మెంట్ జరిగింది’’ అని ఇన్‌స్టా‌గ్రామ్‌లో రాసుకొచ్చాడు. కాగా, రింకూ సింగ్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతున్నాడు. ఈ నెలలోనే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్‌లో రింకూ సింగ్ ఆడాడు. ఇక, కాబోయే సతీమణి ప్రియా సరోజ్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై పోటీ చేసి మచ్లిషహర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. తొలిసారి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. వారణాసికి చెందిన ప్రియా సరోజ్ చాలా సంవత్సరాలుగా సమాజ్‌వాదీ పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తండ్రి తరపున ప్రచారం చేశారు. తొలిసారి ఆ ఎన్నికల్లో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.

Read this- ISKCON Monk: సుందర్ పిచాయ్‌ ప్రశ్నకు ఇస్కాన్ సన్యాసి ఇచ్చిన సమాధానం ఇదే

రింకూ ట్రాక్ రికార్డు ఇదే
రింకూ సింగ్ టీమిండియా టీ20 జట్టులో కీలకమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2023లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 30 టీ20 మ్యాచ్‌లు ఆడి, 22 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు దిగి 46.09 సగటుతో 507 పరుగులు సాధించారు. స్ట్రైక్ రేట్‌ 165.14 గా ఉంది. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌‌లో ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. ఇక, భారత్ తరపున 2 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అద్భుతమైన గణాంకాలను కలిగి ఉన్నాడు. మొత్తం 52 మ్యాచ్‌ల్లో 1,899 పరుగులు సాధించాడు. సగటు 48.69గా, స్ట్రైక్ రేటు 94.8గా ఉన్నాయి. 17 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉన్నాయి.

ఐపీఎల్‌లో గణాంకాలు ఇవే
రింకూ సింగ్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకి ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 29.42 సగటు, 153.73 స్ట్రైక్ రేట్‌తో 206 పరుగులు సాధించాడు. ఈ ప్రభావం జట్టుపై కూడా పడింది. 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన ఆ జట్టు 12 పాయింట్లు, -0.305 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పరిమితమైంది.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు