Duvvada: వైసీపీ మాజీ నేత, ఈ మధ్య అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో గట్టిగానే నిలుస్తున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి (Duvvada Srinivas, Divvela Madhuri) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీళ్లు ఏం మాట్లాడినా అదొక సంచలనంగానే మారుతోంది. అంతేకాదు.. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా అంతకుమించి వైరల్‌గా మారిపోతున్న పరిస్థితి. కాసేపు ఇప్పటి విషయాలు పక్కనెడితే వైసీపీ అధికారంలో ఉండగా దువ్వాడ ఓ రేంజిలోనే రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) అనకూడని మాటలు అనేశారు కూడా. అంతేకాదు.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దువ్వాడ నోటికి అడ్డూ అదుపులేకుండా పోయిందనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి. అయితే అధికారం పోవడం, తనను వైసీపీ నుంచి పక్కనెట్టడంతో హితబోధ అయ్యిందేమో కానీ.. దెబ్బకు దారిలోకి వచ్చేశారు. దువ్వాడ-దివ్వెల జంటపై సోషల్ మీడియా, జనసేన కార్యకర్తల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతాయి. ఈ నేపథ్యంలో.. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నందున పదవిలో ఉండే అర్హత లేదని దువ్వాడ, మాధురి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పవన్ చేస్తే ఒప్పు, తాము చేస్తే తప్పా అని ప్రశ్నించారు కూడా. దీంతో ఇది కాస్త వివాదంగా మారి దువ్వాడ వర్సెస్ జనసేన, మెగా ఫ్యాన్స్‌గా పరిణామాలు ఏర్పడ్డాయి.
Read Also- YSRCP: అంబటికి ఝలక్ ఇచ్చిన వైఎస్ జగన్.. వాట్ నెక్స్ట్?
సారీ.. సేనాని!
ఆ తర్వాత పలుమార్లు మీడియా, ఇంటర్వ్యూల్లో తాను గతంలో పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని పశ్చాత్తాపానికి గురయ్యారు. ఆ పరిస్థితుల్లో పవన్‌పై అలా వ్యాఖ్యాలు చేయాల్సి వచ్చిందని.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటో తనకు తెలియదని, ఇప్పుడు తన పరిస్థితి కూడా అలాగే ఉందని దువ్వాడ చెప్పారు. సమస్య తన వరకు వస్తే కానీ తెలియలేదని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సైతం దువ్వాడ ఈ వ్యవహారంపై స్పందించారు. వ్యక్తిగత విషయంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎంతో మంది ట్రోల్స్ చేశారు.. ఇది కరెక్టే అంటారా అనే ప్రశ్న ఇంటర్వ్యూలో దువ్వాడ, దివ్వెలకు ఎదురైంది. ఈ ప్రశ్నకు బదులిస్తూ.. ‘ అవునమ్మా.. నేను కూడా అన్నాను తప్పే (నవ్వుతూ)’ శ్రీనివాస్ బదులిచ్చారు. మొత్తానికి చూస్తే.. తాను రెండో పెళ్లి చేసువడానికి రెడీ అవుతున్న పరిస్థితుల్లో వస్తున్న ట్రోలింగ్స్‌తో.. తప్పేనని తెలుసుకున్న దువ్వాడ ఇలా చెప్పుకొచ్చారు.
అదిరేది లేదు..!
‘ నన్ను వైసీపీ సస్పెండ్ చేసినంత మాత్రాన అదిరేది లేదు.. బెదిరేది లేదు. గెలుపోటములను పక్కనెట్టండి. మమ్మల్ని తొక్కారు.. మేం కూడా తొక్కుతాం (దువ్వాడ, దివ్వెల).. తొక్కేస్తాం అంతే. గెలుస్తామా, ఓడుతామా అనేది సెకండరీ.. నన్ను తొక్కారు కదా? మేం తొక్కుతాం. అయినా తొక్కడం ఎంతసేపు.. ఎవర్ని ఓడించడం ఎంతసేపు చెప్పండి.. గెలిపించడమే కష్టం’ అని దువ్వాడ జంట క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆ మధ్య దువ్వాడ-మాధురిలకు పుట్టబోయే బిడ్డకు జగన్ పేరు పెట్టే విషయంపై కాంట్రవర్సీ నడిచింది. దీనిపైనా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘ జగన్ పేరు పెడతానని కానీ, పెట్టను అని కానీ మేం ఎప్పుడూ చెప్పలేదు.. మాకు ఆ పేర్లు అలవాటు లేదు. మాకెందుకండి ఆ కామెడీ మాటలు?’ అని మాధురీ, శ్రీనివాస్‌లు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే.. జగన్ అనే పేరు కామెడీనా? లేకుంటే మరో ఉద్దేశంతో ఇలా మాట్లాడారా? అనేది వాళ్లకే తెలియాలి. ఇక కామెంట్స్ అంటారా..? ఎవరికి తోచినట్లుగా వాళ్లు దుమ్ముదులిపేస్తున్నారు.
Read Also- Sridevi: బిగ్ షాక్.. శ్రీదేవికి ఇద్దరు కాదు ముగ్గురు కూతుళ్లు.. ఆమె ఎక్కడ ఉందంటే?