Sandhya Convention Land Dispute: గచ్చిబౌలికి గుండెకాయ లాంటి ఏరియాలో సంధ్య కన్వెన్షన్ ఉన్నది. దీని ఓనర్ శ్రీధర్ రావు. (SridharRao) కన్వెన్షన్ పక్కనే ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థలం ఉన్నది. కొందరు ప్లాట్ ఓనర్లను బెదిరించి సంధ్య శ్రీధర్ . (Sridhar) చాలావరకు భూమిని లాగేసుకుని లే ఔట్ స్వరూపాన్నే మార్చేశాడు. అసలు, ప్లాట్ ఓనర్లను భూమిలోకి రాకుండా తన అనుచరులతో బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన కథనాలను గతంలో ఆధారాలతో సహా ‘స్వేచ్ఛ’ ప్రచురించింది. ఇదే క్రమంలో హైడ్రా రంగంలోకి దిగి చర్యలకు పూనుకున్నది.
రంగంలోకి హైడ్రా
శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (ఎఫ్‌సీఐ) లే ఔట్‌ను హైడ్రా (Hydra) పునరుద్ధరించింది. ఈ లే ఔట్ హద్దులను చెరి పేస్తూ సంధ్యా శ్రీధర్ రావు పలు నిర్మాణాలు చేయగా, వాటిని అక్రమ నిర్మాణాలుగా నిర్ధారించిన హైడ్రా (Hydra) గత నెల 6వ తేదీన తొలగించింది. 20 ఎకరాలకు పైగా ఉన్న ఈ లే ఔట్‌లో సుమారు 170 మంది ప్లాట్ యజమానులు ఉన్నారు. 1980వ దశకంలో వేసిన ఈ లే ఔట్ నామరూపాలు లేకుండా కబ్జాలకు గురైందని హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆక్రమణలను తొలగించింది. రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల హద్దులు లేకుండా పోయిన ఈ లే ఔట్‌ను హైడ్రా జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి మళ్లీ జీవం పోసింది.
Also Read: CM Revanth Reddy: తొలి దశలో 4 ప్రాంతాల్లో.. అత్యాధునిక గోశాలలు!
రోడ్డుపైనే ఫుడ్ కోర్టులు
గతంలో ఉన్న లే ఔట్ ప్రకారం రహదారులకు హద్దులు నిర్ధారించి, వెంటనే వాటి నిర్మాణానికి హైడ్రా చర్యలు తీసుకున్నది. ప్రధాన రహదారులతో పాటు ఇంటర్నల్ రహదారులను కూడా పునరుద్ధరించింది. రహదారులతో పాటు పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల హద్దులను నిర్ధారించడంతో అక్కడి ప్లాట్ యజమానులు హర్షం వ్యక్తం చేశారు. లే ఔట్ ప్రకారం ఎవరి ప్లాట్‌ను వారు గుర్తించి హద్దులు నిర్ధారించుకున్నారు. మ్యాంగో, యునెక్స్ ఫుడ్ కోర్టులతో పాటు స్పైసీ బార్‌తో కలిపి 7 వరకు ఉన్న దుకాణ సముదాయాలు కూడా రోడ్డుపై నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. వాటిని తొలగించాలని నిర్వాహకులకు సమాచారమిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో వాటిని కూడా తొలగించి రోడ్డు నిర్మాణం చేపడతామని హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ స్పష్టం చేశారు.
ప్లాట్ యజమానులపై దాడి
మరోవైపు, లే ఔట్ పునరుద్ధరణలో భాగంగా హైడ్రా మార్కింగ్ చేస్తుండగా, ఫొటోలు తీస్తున్న ఓ ప్లాట్ యజమానిపై పక్కనే ఉన్న సంధ్య శ్రీధర్ రావు అనుచరులు దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా, ఓ ప్లాట్ యజమానురాలైన సినీ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్‌పై కత్తి, క్రికెట్ బ్యాట్‌తో దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. గాయాలపాలైన వారిద్దరూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు తమపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని రమ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు(SridharRao) ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: GHMC Commissioner: టౌన్ ప్లానింగ్‌పై.. ఫిర్యాదుల వెల్లువ!