CM Revanth Reddy: రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు. పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో కూడిన కమిటీ లోతైన అధ్యయనం చేయాలని సీఎం (CM) ఆదేశించారు. రాష్ట్రంలో గో సంరక్షణపై (Cattle Protection) సీఎం (CM Revanth Reddy: ) తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.
Also Read: HYDRA Commissioner: ప్రజావసరాల స్థలాలను కాపాడుతున్నాం.. రంగనాథ్ స్పష్టం!
రూపకల్పన ఉండాలి
సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే (Cattle Protection) ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని, స్థలాభావం, ఇతర సమస్యలతో అవి తరచూ మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులను అధిగమించి గోవుల సంరక్షణే ధ్యేయంగా తొలుత రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సీఎం సూచించారు.
శ్రద్ధ కనపర్చాలి
ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్థక శాఖ విశ్వ విద్యాలయం సమీపంలో విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించాలన్నారు. భక్తులు అత్యధిక భక్తిశ్రద్ధలతో సమర్పించే కోడెలపై ప్రత్యేకమైన శ్రద్ధ కనపర్చాలన్నారు. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలన్నారు. గో సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్ పేపర్‌ను అధికారులు సీఎంకు అందజేశారు.
Also Read: Schools Reopen: విద్యార్థులకు.. యూనిఫామ్ బుక్స్ అందజేయాలి!