Schools Reopen( image credit: twitter)
హైదరాబాద్

Schools Reopen: విద్యార్థులకు.. యూనిఫామ్ బుక్స్ అందజేయాలి!

Schools Reopen: నేటి నుంచి హైదరాబాద్ జిల్లాలోని స్కూల్స్ రీ ఓపెన్ కానున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లు పునః ప్రారంభమయ్యే ఫస్ట్ డే 12న ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం నెలకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పాఠశాలలో తోరణాలు కట్టి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్వాగతం పలికాలని పాఠశాలల సిబ్బందికి కలెక్టర్ సూచించారు. స్కూల్స్ రీ ఓపెన్ పై కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో విద్యా, వైద్య, సంక్షేమ శాఖ అధికారులతో బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు.

బడి బాట యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి

ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ హైదరాబాద్ జిల్లాలో లక్షా 3 వేల 912 జతల యూనిఫామ్ లు, 9 లక్షల 63 వేల 307 టక్స్ట్ బుక్ లు, 6 లక్షల 25 వేల 660 నోట్ బుక్ లను, మరో లక్షా 47 వేల 951 వర్క్ బుక్ లు విద్యార్థులకు పంపిణీ కావల్సి ఉన్నాయని, వీటన్నింటిని ఈ నెల 12వ తేదీలోపు నూటికి నూరు శాతం విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. పాఠశాల సిబ్బంది ప్రతి ఒక్కరూ తప్పకుండా బడి బాట యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని, దాని ద్వారా విద్యార్థుల హాజరు, గైర్హాజరు, సంఖ్యను ఎప్పటికపుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. బడి బయట ఉన్న పిల్లలందరికీ బడికి తీసుకువచ్చేందుకు ప్రతి పాఠశాల హెడ్ మాస్టర్ కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

 Also Read: Kaleshwaram Commission: 115వ సాక్షిగా కమిషన్.. ఒన్ టు వన్ విచారణ!

పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలి

స్కూల్స్ రీ ఓపెన్ రోజున వసతి గృహాల్లోని కిచెన్ రూమ్, బెడ్ రూమ్, స్టోర్ రూమ్, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలను పర్యవేక్షించాలని ఆదేశించారు. పెండింగ్ పేమెంట్లు ఉంటే వెంటన్ చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలు 1941 ఉన్నారని,వారందరూ పాఠశాలలకు వచ్చేలా చూడాలన్నారు. జిల్లాలో 21 భావిత సెంటర్లు ఉన్నాయని,వాటిని రెన్యూవేషన్ చేయాలని, భవిత సెంటర్ లను నీట్ ఉండేలా చూడాలని, ఈ సెంటర్లు లేని చోట ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. క్షేత్రస్థాయిలో డిప్యూటీ ఈ వో, డిప్యూటీ ఐఓఎస్ లు పర్యవేక్షించాలని ఆదేశించారు.

అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలి 

బాల్ భరోసా సర్వే అయిపోయిందని డేటానుయాప్ లో ఫీడ్ చేయడం జరిగిందన్నారు.సీడీపీఓలు అంగవైకల్యం గల హార్ట్, క్రిటికల్ సర్జరీ చేయవల్సి ఉన్న పిల్లలకు తమ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలకు తీసుకువెళ్లి, బాల్ భరోసా కింద వైద్య సేవలు అందించేందుకు జాబితా తయారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడి బాట కార్యక్రమంలో రెండు సంవత్సరాలు గల పిల్లలకు అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని, సీడీపీఓ సూపర్ వైజర్ అంగన్‌వాడీల వారీగా డేటా సమర్పించాలని ఆదేశించారు. ఈ ఈ జూమ్ మీటింగ్ లో జిల్లా విద్యాశాఖ అధికారిని ఆర్ రోహిణి, డిప్యూటీఈవోలు, డిప్యూటీ ఐఓఎస్ లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

 Also Read: Duddilla Sridhar Babu: సెమీ కండక్టర్ల తయారీ.. డిజైనింగ్ లో యువతకు శిక్షణ!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?