Nagpur zipline
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Zipline Mishap: పాపం పదేళ్ల బాలిక.. 30 అడుగుల ఎత్తు నుంచి..

Zipline Mishap: అడ్వెంచర్ టూరిజంలో సేఫ్టీ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. లేదంటే, ఊహించని ప్రమాదాలను చవిచూడాల్సి ఉంటుంది. అలాంటి ఘటనే ఒకటి హిమాచల్‌ప్రదేశ్‌లో (HimachalPradesh) జరిగింది. సరదాగా ఫ్యామిలీ వెకేషన్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి దురదృష్టం ఎదురైంది. మనాలీలో జిప్‌లైన్ బెల్ట్ (Zipline Belt Broke) తెగిపోవడంతో ఓ పన్నెండేళ్ల బాలిక కిందపడింది. ఏకంగా 30 అడుగుల ఎత్తు నుంచి పెద్ద పెద్ద రాళ్లు తేలియాడుతున్న నదిలో పడింది. దీంతో, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన త్రిష బిజ్వే అనే బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. కాలికి తీవ్రమైన గాయాలయ్యాయి. కాలికి పలుచోట్ల ఫ్రాక్చర్ అయ్యింది. బాలిక పట్టుకున్న జిప్‌లైన్ కేబుల్ బెల్ట్ హఠాత్తుగా తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న బాలిక తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కాలికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు, ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.

Read this- Vijay Rupani: 3 రోజుల తర్వాత మాజీ సీఎం డెడ్‌బాడీ గుర్తింపు

ఆపరేటర్లే బాధ్యత వహించాలి
ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రదేశంలో తమకు ఎలాంటి సాయం అందలేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. తొలుత మనాలీలో చికిత్స అందించామని, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం చంఢీగఢ్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించామని పేర్కొన్నారు. ప్రస్తుతం నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో త్రిష చికిత్స పొందుతోందని వివరించారు. బాలిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోను కూడా కుటుంబ సభ్యులు షేర్ చేశారు. జిప్‌‌లైన్ ఆపరేటర్లే ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. పర్యాటక ప్రదేశంలో భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.

Read this- AirIndia Crash: ఎయిరిండియా క్రాష్‌పై తుర్కియే కీలక ప్రకటన

ఒక్కరూ సాయం చేయలేదు
తమ కూతుర్ని కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదని బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక కిందపడిన తర్వాత కూడా ఒక వ్యక్తి వీడియో తీశాడు తప్ప రక్షించే ప్రయత్నం చేయలేదని అన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి, బాలిక కిందపడిపోయిందంటూ అటుగా వెళుతున్న వ్యక్తులకు చెప్పడం వీడియోలో వినిపించింది. కానీ, సాయం చేసేందుకు అతడు ప్రయత్నించలేదు. రెస్క్యూ టీమ్ వాళ్లు కూడా ఎవరూ బాలికను కాపాడే ప్రయత్నం చేయలేదు. అసలు రోప్ ఎవరు కట్టారనేది కూడా తెలియరాలేదు. దీనిని బట్టి అక్కడ భద్రతా ప్రమాణాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జిప్‌లైన్ దగ్గర సరైన భద్రతా చర్యలు లేవని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ వీడియో కొందరు స్పందిస్తూ, అడ్వెంచర్ టూరిజానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తు్న్నారు. కొండ ప్రాంతాల్లో జిప్‌లైన్ కేబుల్ ఉపయోగిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

Read this- Solar Power Plants: రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు.. ప్రతి జిల్లాకు రెండు

Just In

01

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ