Vijay Rupani Deadbody
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Vijay Rupani: 3 రోజుల తర్వాత మాజీ సీఎం డెడ్‌బాడీ గుర్తింపు

Vijay Rupani: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం’ ప్రమాదానికి గురై మూడు రోజులు గడిచిపోయింది. ఈ దుర్ఘటన గురువారం (జూన్ 12) జరిగినప్పటికీ మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మాత్రం ఇంకా పూర్తికాలేదు. విమానం కూలిన తర్వాత సంభవించిన భారీ పేలుడు ధాటికి ప్యాసింజర్లు అగ్నికి ఆహుతయ్యారు. ఎముకలు, కొంతమేర మాంసపు ముద్దలు మినహా శరీరంపై ఏమీ మిగల్లేదు. దీంతో, వ్యక్తుల గుర్తింపు ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా మారింది. అందుకే, పెద్ద ఎత్తున డీఎన్ఏ పరీక్షలు చేపట్టాల్సి వస్తోంది. అయితే, ప్రమాదం జరిగిన మూడు రోజుల తర్వాత గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని (Vijay Rupani) ఆదివారం గుర్తించారు. ఈ మేరకు డీఎన్‌ఏ పరీక్షలో నిర్ధారణ జరిగింది.

రాజ్‌కోట్‌కు తరలింపు

విజయ్ రూపానీ గుర్తింపునకు సంబంధించిన డీఎన్ఏ పరీక్ష ఫలితాలు ఆదివారం ఉదయం 11:10 గంటలకు వచ్చాయి. దీంతో, విజయ్ రూపానీ మృతదేహాన్ని చార్టర్డ్ విమానంలో అహ్మదాబాద్ నుంచి రాజ్‌కోట్‌ పట్టణానికి తీసుకెళ్లనున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లపై కూడా ఈరోజే ప్రకటన రానుంది. మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు తీసుకోనున్నారు. అయితే, అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలియాల్సి ఉంది. నిజానికి, విజయ్ రూపానీ తొలుత మే 19న లండన్‌కు వెళ్లాలని భావించారు. టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో రద్దు చేసుకొని, తిగిరి జూన్ 5కి ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకున్నారు. అనూహ్యంగా దానిని కూడా రద్దు చేసుకొని చివరకు, జూన్ 12న ఏఐ171 విమానంలో సీటు బుక్ చేసుకున్నారు. బిజినెస్ క్లాస్ సీటు 2డీలో ఆయన కూర్చున్నారు. లండన్‌లో ఉన్న తన భార్య, కూతుర్ని తిరిగి స్వదేశానికి తీసుకు రావడానికి బయలుదేరినట్టు సమాచారం.

Read this- Air India Crew: అడ్డంగా దొరికిపోయిన ఎయిరిండియా సిబ్బంది

32 మంది మృతదేహాల గుర్తింపు
ఆదివారం నాటికి, 32 మంది డెడ్‌బాడీలను అధికారులు గుర్తించారు. 14 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. మిగతా మృతదేహాలను డీఎన్ఏ టెస్టుల ఆధారంగా గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న విమానంలో విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 242 మంది ఉండగా, అందులో 241 మంది మరణించారు.విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలింది. ఎయిర్‌పోర్టుకు కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మేఘని నగర్ ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. బిల్డింగ్‌ను ఢీకొన్న వెంటనే భారీ పేలుడు సంభవించింది. 10 గంటల ప్రయాణం కోసం విమానానికి 80-90 టన్నుల ఫ్యూయెల్ నింపడంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ ధాటికి హాస్టల్ భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. 33 మందికి పైగా ఎంబీబీఎస్ విద్యార్థులు చనిపోయారు. క్యాంపస్‌లోని చెట్లు, పక్షలు, జంతువులు కూడా కాలిబూడిదయ్యాయి.

Read this- Samantha: అఖిల్ కోసం సమంత.. నాగ చైతన్యను కలిసిందా.. పెళ్లికి వచ్చింది నిజమేనా?

కాగా, ఎయిర్‌పోర్టు సీసీటీవీ ఫుటేజ్‌ ప్రకారం, విమానం మధ్యాహ్నం 1:38 గంటలకు గాల్లోకి ఎగిరింది. కేవలం 32 సెకన్లు మాత్రమే గాల్లో ఉంది. ఆ తర్వాత ఎత్తును కోల్పోయింది. జేబీ మెడికల్ కాలేజీ కాంపౌండ్‌లోకి దూసుకెళ్లినట్టు సీసీ ఫుటేజీలలో స్పష్టమైంది. కాగా, ఈ దుర్ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ), బోయింగ్ ఫోరెన్సిక్ బృందం విచారణ జరుపుతున్నాయి. బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషిస్తున్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు