Ginger Tea: మనలో చాలా మంది అల్లం టీని ఇష్టంగా తాగుతారు. దీని రుచి, సువాసనకే ఎంతో మంది టీలో అల్లాన్ని వేసుకొని తాగుతూ ఉంటారు. అయితే, అల్లం టీ తాగడం వలన మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Udaya Bhanu: ‘హరి హర వీరమల్లు’ పరువు తీసేసిన యాంకర్ ఉదయభాను.. వీడియో వైరల్!
అల్లం టీ ని ఎక్కువగా తాగడం వలన శరీరంలో వ్యాధి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, వికారం, వాంతులతో బాధపడుతున్న వారు అల్లం టీని తీసుకుంటే.. ఈ సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఇంకా దీన్ని తీసుకోవడం వలన జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. అలాగే, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.
Also Read: Chandrababu Naidu: ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే.. ఏపీ ముఖ్యమంత్రి సంచలన వాఖ్యలు!
అల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అల్లం టీ తాగడం వలన రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. డయాబెటిస్ తో బాధ పడే వారికి అల్లం టీ చాలా మంచిది. అదే విధంగా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.