Udaya Bhanu on Hari Hara Veera Mallu
ఎంటర్‌టైన్మెంట్

Udaya Bhanu: ‘హరి హర వీరమల్లు’ పరువు తీసేసిన యాంకర్ ఉదయభాను.. వీడియో వైరల్!

Udaya Bhanu: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా రిలీజ్ కష్టాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా.. జూన్ 12న కచ్చితంగా వస్తుందని మేకర్స్ చెబుతూ వచ్చారు. థియేటర్ల బంద్ అనే ఇష్యూని దాటుకుని, విడుదలకు వస్తుందని ఫ్యాన్స్ అంతా సంబరాలకు సిద్ధమవుతుండగా.. సడెన్‌గా ఈ సినిమా మరోసారి వాయిదా పడుతున్నట్లుగా వార్తలు రావడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. మొదట నమ్మలేదు కానీ, మేకర్స్ కూడా అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సినిమాకు సంబంధించిన కొన్ని పనుల జాప్యం కారణంగా ‘హరి హర వీరమల్లు’ విడుదలను స్వల్ప వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు కానీ, విడుదల ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు. ఇంకా ఎన్ని సార్లు వాయిదా వేస్తారు అంటూ మేకర్స్‌పై మండిపడుతున్నారు.

Also Read- Akkineni Amala on Zainab: అక్కినేని వారి కొత్త కోడలికి కండిషన్లు పెట్టిన అమల.. తట్టుకోగలదా?

ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు ఉదయభాను కామెంట్స్ ఫ్యాన్స్‌కి పిచ్చ కోపాన్ని తెప్పిస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ సినిమాకు, ఉదయభానుకు లింకేంటి? అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది మ్యాటర్. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఏవైనా స్పెషల్ కార్యక్రమాలను నిర్వహిస్తే.. ఆ కార్యక్రమాలకు యాంకర్‌గా ఉదయభానుకే ఇంపార్టెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బాలయ్య వేడుకలో కనిపించిన ఉదయభాను, తాజాగా మచిలీపట్నంలో జరిగిన ఓ టీడీపీ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించింది. మచిలీపట్నం విశిష్టతకు సంబంధించిన ఈ కార్యక్రమానికి ‘హరి హర వీరమల్లు’ ప్రస్తుత దర్శకుడు ఎఎమ్ జ్యోతికృష్ణను కూడా ఆహ్వానించారు. జ్యోతికృష్ణను ఈ వేడుకకు ఆహ్వానించడానికి కారణం లేకపోలేదు.

Also Read- Kannappa: మళ్లీ బ్రాహ్మణులతో పెట్టుకున్న మంచు ఫ్యామిలీ.. ఈసారి ఏమవుతుందో?

‘హరి హర వీరమల్లు’ సినిమాలో మచిలీపట్నం పోర్ట్‌కు సంబంధించి ఓ కీలకమైన ఎపిసోడ్‌ని చిత్రీకరించారు. అందుకే, మచిలీపట్నం విశిష్టతను తెలిపే ఈ కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం వచ్చింది. ఈ సందర్భంగా జ్యోతికృష్ణ మాట్లాడుతున్నప్పుడు.. ‘మాకు ఎందుకో అనిపిస్తుంది.. ఎక్కడో పవర్ స్టార్ ఇందులో పాట పాడారేమో అని చిన్న డౌట్ కొడుతుంది. ఏమైనా సీక్రెట్టా? సార్’ అని ఉదయభాను ప్రశ్నించింది. దీనికి ఒక్కసారిగా దర్శకుడి ఫేస్ తెల్లబోయింది. ఉదయభానుకి తెలియకపోతే కామ్‌గా ఉన్నా పోయేది.. ఇలా అడిగి ‘హరి హర వీరమల్లు’ పరువు తీసేసింది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ పాడిన పాట ‘మాట వినాలి’ ఎప్పుడో విడుదలైంది. పాట కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో కూడా ఉంది. మరి ఉదయభాను అలా పబ్లిగ్గా అడిగే సరికి.. ఆ దర్శకుడికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఇక దీనిని ఆసరాగా తీసుకుని యాంటీ ఫ్యాన్సే కాదు.. మెగా ఫ్యాన్స్ కూడా మేకర్స్‌పై కౌంటర్లు వేస్తున్నారు. ఇది, పబ్లిక్‌లో సినిమా పరిస్థితి.. ఇలా వంద సార్లు వాయిదా పడితే.. ఏది ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ గుర్తుండదు. ఇప్పటికైనా మారండి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?