Akkineni Amala on Zainab: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కినేని అఖిల్ (Akkineni Akhil) పెళ్ళికి సంబంధించిన ఫోటోలే కనిపిస్తున్నాయి. కొద్దిమంది సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా శుక్రవారం(జూన్ 6) ఉదయం 3.35 గంటలకు అఖిల్, జైనబ్ (Jainab) పెళ్లి జరిగింది. అయితే, పెళ్లి తర్వాత అక్కినేని వారి కొత్త కోడలికి సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతున్నది.
కొత్త కోడలికి అమల కండిషన్లు
అక్కినేని అఖిల్‌ను పెళ్లి చేసుకున్న జైనబ్‌కు అత్త అమల (Amala) మైండ్ బ్లాక్ అయ్యే కండిషన్లు పెట్టిందని టాక్. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భర్త ఉన్నప్పుడు అతనితోనే టైమ్ స్పెండ్ చేయాలని, ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లకూడదని, అలాగే ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగా వండకూడదని చెప్పినట్టు టాక్. ఒకవేళ నాన్ వెజ్ తినాలనిపిస్తే భర్తతో కలిసి బయటికి వెళ్లి తినాలని ముందే చెప్పారట.
వంట విషయంలో జాగ్రత్తలు
వంట చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భర్తకు నచ్చిన ఫుడ్స్ అన్నీ నేర్చుకోవాలని జైనబ్‌తో అమల చెప్పారట. ఇంకా షాపింగ్స్‌కు వెళ్ళే టైమ్‌లో పొట్టి బట్టలు అసలు వేసుకోకూడదని, సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలని, ముఖ్యంగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో చీర కట్టుకోవాలని చెప్పినట్టు సమాచారం. ఈ కండిషన్లకు కొత్త కోడలు జైనబ్ ఒప్పుకున్న తర్వాతే వీరి పెళ్లి జరిగిందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తున్నది. అయితే, గతంలో సమంతకు కూడా ఇలాంటి కండిషన్లే పెట్టి ఉంటారన్న చర్చ కూడా జరుగుతున్నది. అక్కినేని చైతన్య, సమంత 2017లో పెళ్లి చేసుకోగా, నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు.
గతేడాది నిశ్చితార్థం
అఖిల్, జైనబ్‌కు గతేడాది నిశ్చితార్థం జరిగింది. చాలా సీక్రెట్ ఉంచారు. తర్వాత అఫీషియల్‌గా ఫోటోలను విడుదల చేశారు. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలలకు ఇప్పుడు సంప్రదాయ పద్ధతిలో అఖిల్, జైనబ్ పెళ్లి చేసుకున్నారు. అక్కినేని ఫ్యామిలీతోపాటు, సినీ, రాజకీయ ప్రముఖుల్లో తనకు సన్నిహితంగా ఉండే కొంతమందికి నాగార్జున ఆహ్వానం ఇచ్చారు. వారి సమక్షంలో పెళ్లి తంతు ఘనంగా జరిగింది.
జైనబ్ హిస్టరీ
ముంబైకి చెందిన జైనబ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కుమార్తె. జైనబ్ తండ్రి, నాగార్జున మంచి స్నేహితులు. ఆ కారణంతో ఇరు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అలా అఖిల్, జైనబ్‌కు పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమకు దారి తీసింది. వీరిద్దరి మధ్య ఎనిమిదేళ్ల గ్యాప్ ఉంది. అఖిల్ కంటే జైనబ్ పెద్దది. అయినా కూడా వీరి ప్రేమను ఒప్పుకున్న ఫ్యామిలీ ఘనంగా పెళ్లి జరిపించింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు