Revanth Reddy
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Revanth Reddy: స్కూల్ బీజేపీలో, కాలేజీ టీడీపీలో, ఉద్యోగం రాహుల్ దగ్గర.. రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని మోదీని (Narendra Modi) కలిసినప్పుడు బీజేపీలో స్కూలింగ్‌.. చంద్రబాబు (Chandrababu) దగ్గర కాలేజీ చదివానని చెప్పానన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) దగ్గర ఉద్యోగం చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. కాగా.. స్కూల్ మోదీ దగ్గర చదువుకున్నానని చెప్పడాన్ని బీజేపీలో ఉన్న కాలాన్ని సూచిస్తుంది. కాలేజ్ చంద్రబాబు దగ్గర పూర్తి చేశానని చెప్పడం ఇది ఆయన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చంద్రబాబుతో కలిసి పని చేసిన కాలాన్ని, ఇప్పుడు ఉద్యోగం మాత్రం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నాను అనేది కాంగ్రెస్ పార్టీలో (రాహుల్ నాయకత్వంలో) ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత పరిస్థితిని సూచిస్తుంది. వ్యక్తిగతంగా నాయకులందరితో సన్నిహిత సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. తనకున్న సన్నిహిత సంబంధాలను ఎప్పుడు దాచుకోనని, మంత్రివర్గ విస్తరణ ఉన్నా ఆ కార్యక్రమం పూర్తవ్వగానే దత్తాత్రేయ కోసం ఇక్కడికి వచ్చానని.. ఆయన అజాత శత్రువు అని రేవంత్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) ‘ప్రజలకథే నా ఆత్మకథ’ (Prajale Na Aatmkatha) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

Bandaru Dattatraya

Read Also- TG New Ministers: ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచి జాక్ పాట్.. ఎవరీ వాకిటి, అడ్లూరి?

దత్తన్న స్పూర్తితో..
కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించే వారు ప్రముఖ నాయకుడు బండారు దత్తాత్రేయ జీవనశైలిని చూసి ఎంతో నేర్చుకోవలసి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ (Alai Balai) కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని గుర్తుచేశారు. ‘ హైదరాబాద్ గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు సుదీర్ఘమైన ప్రయాణంలో దత్తాత్రేయ ఎన్నో ఒడిదుడుకులను అనుభవించారు. వారు ప్రజలతో సంబంధాలను ఏనాడూ కోల్పోలేదు. నాకు వారితో 40 సంవత్సరాల అనుబంధం ఉంది. దత్తాత్రేయ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దత్తాత్రేయను గౌరవించని నాయకులు తెలంగాణలో ఎవరూ లేరు. దత్తాత్రేయ స్ఫూర్తి మా ప్రభుత్వ నిర్ణయాల్లో ఉంటుంది. రాజకీయంగా భిన్న మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ వ్యక్తిగత సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ప్రయత్నం చేయడం లేదు. ఆయన్ను చూసి ఎంతో నేర్చుకోవాలి. ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటంలో దత్తాత్రేయ అజాత శత్రువు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జాతీయ రాజకీయాల్లో పదవుల్లో ఉన్నా లేకున్నా వారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదు. అలాగే దత్తాత్రేయను కూడా అదే తీరుగా గౌరవిస్తారు’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.

Prajale Na Aatmkatha

ఆ ఇద్దరి పేర్లే..
‘ బీజేపీ నాయకుడిగా కన్నా దత్తాత్రేయను ఒక మర్యాద కలిగిన నాయకుడిగా అందరూ గౌరవిస్తారు. జంట నగరాల ప్రజలకు ఏ బాధ ఉన్న వినడానికి ఇద్దరు నాయకుల పేర్లు వినిపిస్తాయి. ఖైరతాబాద్ పి. జనార్ధన్ రెడ్డి (P. Janardhan Reddy), బండారు దత్తాత్రేయ. జంట నగరాల నాయకులు ఈ నేతలను గమనించాలి. దత్తాత్రేయతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డిని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూనే వారితో ఉన్న సాన్నిహిత్యంతో తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు (CM Nara Chandrababu), ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, భూపతి రాజు శ్రీనివాస వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మరెందరో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పాల్గొన్నారు.

Read Also- Dusting Challenge: తెరపైకి కొత్త ఛాలెంజ్.. టీనేజర్ బలి

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?