Sonia Gandhi Health
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Sonia Gandhi Health: సోనియా గాంధీకి పెరిగిన బీపీ.. తాజా పరిస్థితి ఏంటంటే?

Sonia Gandhi Health: కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ (78) (Sonia Gandhi) శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కూతురు ప్రియాంక గాంధీ వాద్రాతో (Priyanka Gandhi) కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం సిమాల్లో ఉన్న ఆమె హైబీపీకి గురయ్యారు. దీంతో, నగరంలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు ఆమెను తరలించారు.

Read this- Off beat News: వైరల్ వీడియో చూసి యువకుడి అరెస్ట్.. ఏం చేశాడో తెలుసా?

హాస్పిటల్ వైద్యులు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. టెస్ట్ ఫలితాలు నార్మల్‌గా వచ్చాయి. బీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆరోగ్యం బాగానే ఉండడంతో హాస్పిటల్‌ నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయారని హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా.అమన్ తెలిపారు. ‘‘సోనియాకు బీపీ ఎక్కువగా ఉంది. కానీ, ఆరోగ్యం సాధారణంగానే ఉంది. సాధారణ చెకప్‌లు చేశాం. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్లారు. ఎలాంటి ఇబ్బంది లేదు. నిలకడగానే ఉన్నారు ’’ అని హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) సీఎం నరేష్ చౌహాన్ మీడియా ప్రతినిధి మీడియాకు తెలిపారు.

Read this- Viral News: భార్య తల, మొండాన్ని వేరు చేసి.. భర్త కిరాతకం

కాగా, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ ప్రస్తుతం సిమ్లాలో వ్యక్తిగత పర్యటన చేస్తున్నారు. కూతురు ప్రియాంక గాంధీ కూడా ఆమె వెంటే ఉన్నారు. సిమ్లా నగర శివార్లలోని ఛారబ్రాలో ప్రియాంక గాంధీకి ఉన్న నివాసంలో సోనియా గాంధీ నివాసం ఉన్నారు.

Read this- Mobile Blast News: సెల్‌ఫోన్ పేలి సాఫ్ట్‌వేర్ సజీవ దహనం.. అతడి మిస్టేక్ ఇదే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!