Viral News: వివాహేతర సంబంధాలు, భాగస్వాముల పట్ల అనుమానాలు కాపురాల్లో చిచ్చులు పెడుతున్నాయి. కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యేలా చేస్తున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు (Bangalore) నగరంలో ఈ తరహా ఘటనే జరిగింది. శంకర్ అనే 28 ఏళ్ల వ్యక్తి, 26 ఏళ్ల వయసున్న తన భార్య మానసను శుక్రవారం రాత్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో తల, మొండాన్ని వేరు చేశాడు. తలను పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అతడి అనుమానాలే ఈ ఘోర హత్యకు దారితీశాయి. బెంగళూరులోని హీలలిగే ప్రాంతంలో దంపతులు నివాసం ఉంటున్నారని పోలీసులు వెల్లడించారు. మానసకు వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణపై దంపతుల మధ్య వారం రోజులుగా తీవ్రమైన ఘర్షణలు జరిగాయని, ఈ క్రమంలోనే భార్యను శంకర్ హత్య చేశాడని చెబుతున్నారు.
Read this- Election Commission: రాహుల్ గాంధీపై ఎలక్షన్ కమిషన్ ఫుల్ సీరియస్
శంకర్, మానస కొంతకాలం క్రితమే హీలలిగే ప్రాంతంలో అద్దెకు దిగారని చెప్పారు. ‘‘జూన్ 3న రాత్రి శంకర్ పనికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వస్తానని మానసకు చెప్పాడు. అయితే, పని ముందుగానే అయిపోవడంతో చెప్పిన సమయం కంటే ముందుగానే ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో మానస మరొక వ్యక్తితో ఉన్నట్లు శంకర్ గుర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇద్దరి మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. మానస ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత రోజుల్లో మానస తిరిగి భర్త వద్దకు అనేకసార్లు వచ్చి గొడవలు, వేధింపులకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. హత్యకు ముందు రోజు రాత్రి మానస మరోసారి ఇంటికి వచ్చి గొడవ సృష్టించింది. శంకర్ హత్యకు పాల్పడడానికి ఇదే కారణమని భావిస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు.
Read this- Mobile Blast News: సెల్‌ఫోన్ పేలి సాఫ్ట్‌వేర్ సజీవ దహనం.. అతడి మిస్టేక్ ఇదే!
మానస తల నరికి, దానిని పట్టుకొని సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడని అధికారులు తెలిపారు. ‘‘శుక్రవారం రాత్రి భార్యభర్తలు ఘర్షణ పడ్డారు. మానసను శంకర్ దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత తల నరికాడు. తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి నేరాన్ని అంగీకరించాడు. అతడిపై హత్య కేసు నమోదు చేశాం. మానసకు వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. గత వారం ఒక రోజు రాత్రి శంకర్ పనికి వెళ్లి, అనుకున్న సమయం కంటే ముందే ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరికీ పొసగడం లేదు. గత వారం రోజులుగా గొడవ పడుతూనే ఉన్నారు. దంపతులకు ఒక బిడ్డ కూడా ఉంది. ఇదే విషయమై శుక్రవారం రాత్రి కూడా గొడవ పడ్డారు. ఘర్షణ ముదరడంతో మానసకు భర్త శిరచ్ఛేదం చేశాడు’’ అని బెంగళూరు రూరల్ ఎస్పీ సీకే బాబా వివరించారు. సూర్యనగర్ స్టేషన్ పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు. శంకర్‌ను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు కావడంతో తదుపరి దర్యాప్తు జరుగుతుందని వివరించారు.