RBI Rate Cut: కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేయాలని చూస్తున్నవాళ్లకు, ఇప్పటికే వేర్వేరు రుణాలపై ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) శుభవార్త చెప్పింది. కీలకమైన రెపో రేటును (Repo Rate) ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో, రెపో రేటు 6 శాతం నుంచి 5.5 శాతానికి దిగివచ్చింది. ఈ మేరకు ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) శుక్రవారం వెల్లడించారు. ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమీక్ష శుక్రవారంతో ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రెపో రేటు తగ్గింపు నిర్ణయంతో బ్యాంక్ లోన్లు కాస్త తక్కువ రేటుకే వినియోగదారులకు లభించనున్నాయి. అంతేకాదు, ఇప్పటికే ఈఐఎంలు చెల్లిస్తున్న వినియోగదారులపై కూడా కొంతమేర భారం తగ్గుతుంది.
ఈ స్థాయిలో తగ్గింపు ఎందుకు?
దేశంలో నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరల తగ్గింపు, ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ఆర్బీఐ ఈ స్థాయిలో రెపో రేటు (Repo Rate) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. చిల్లర ద్రవ్యోల్బణం (Retail Inflation) ప్రస్తుతం ఆర్బీఐ లక్ష్య పరిధికి కాస్త అటుఇటుగా ఉండడంతో, దానిని స్థీకరించాలని ఎంపీసీ కమిటీ సభ్యులు భావించారు. మరోవైపు, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో (Global Economy) అనిశ్చితి పరిస్థితులు పెరుగుతున్నందున విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయమని భావించి ఎంపీసీ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read this- Shine Tom Chacko: మలయాళం స్టార్ చాటో ఇంట తీవ్ర విషాదం
ఈఎంఐల భారం తగ్గుతుందా?
దేశంలోని వాణిజ్య బ్యాంకులకు అందించే రుణాలపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటునే (Interest Rate) రెపో రేటు అంటారు. ఆర్బీఐ ఉపశమనం కల్పిస్తుండడంతో బ్యాంకులు కూడా ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తాయి. అంటే, లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. అంటే, రుణగ్రహీతలు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు పొందవచ్చు. బ్యాంకులు పూర్తి ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తే, గృహ రుణాలు, కారు లోన్స్, ఇతర వ్యక్తిగత రుణాలు కూడా తక్కువ వడ్డీకే లభిస్తాయి. ఫలితంగా ఈఎంఐల భారం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఎక్కువ ధర పెట్టి ఇల్లు కొనుగోలు చేసినవారికి గొప్ప ఉపశమనని చెప్పారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం డెవలపర్లు, కొనుగోలుదారులకు ప్రయోజనకరంగా మారుతుందని, ఇళ్లకు గిరాకీ పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తక్కువ రేట్లకే రుణాలు లభిస్తే డిమాండ్ పెరుగుతుందని, తద్వారా రియల్టర్లు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు దోహదపడుతుందని అంటున్నారు. కార్లు, బైకుల కొనుగోళ్లు పెరిగి వాహన రంగ వృద్ధికి కూడా ఊతమిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆటో రంగ తయారీదారులు, డీలర్లకు ఆర్బీఐ నిర్ణయం చాలా సానుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.
Read this- Ram Gopal Varma: వర్మ అరాచకం.. మెగా ఫ్యామిలీపై మళ్లీ..!