Shine Tom Chacko: మలయాళ స్టార్ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయింది. ఈ దుర్ఘటనలో టామ్ చాకో తండ్రి సీపీ చాకో చనిపోయారు. టామ్ చాకో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చాకో తల్లి మరియా కార్మెల్, సోదరుడు, కారు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. తన ఫ్యామిలీతో కలిసి కారులో వెళుతుండగా తమిళనాడులోని ధర్మపురి సమీపంలో ఉన్న పాలకోట్టై వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. చాకో ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు లారీ బలంగా ఢీకొట్టింది. టామ్ చాకోతో పాటు గాయపడ్డ ఇతర కుటుంబ సభ్యులు అందరినీ ధర్మపురి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాకో, ఆయన తల్లి, సోదరుడు, కారు డ్రైవర్ అందరూ ఇదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
Read this- Chenab Rail Bridge: దేశ ప్రజలకు గుర్తుండిపోయే రోజు.. వరల్డ్‌లోనే ఎత్తైన వంతెన ప్రారంభం
ప్రమాదంపై కేసు నమోదు
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలొ, టామ్ చాకో తండ్రి సీపీ చాకో అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు నిర్ధారించారు. నటుడు షైన్ టామ్ కూడా చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. కారు, ట్రక్ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అయితే, ప్రమాదం జరిగిన తీరుపై పోలీసు అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సీపీ చాకోకు పోస్ట్‌మార్టం చేస్తామని, వైద్య చికిత్స విషయంలో బాధితులకు సాయం చేస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Read this- CM Revanth Reddy: ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రతీ నెలా రెండుసార్లు.. సీఎం కీలక నిర్ణయం
కాగా, కురుతి, జిగర్తాండ డబుల్ఎక్స్ వంటి మలయాళ మూవీస్‌తో షైన్ టామ్ చాకో ప్రసిద్ధి చెందాడు. ఇతర భాషల ప్రేక్షకులను కూడా తన నటనతో మెప్పించాడు. ఆయన కుటుంబం ప్రమాదానికి గురవ్వడం పట్ల టామ్ చాకో అభిమానులు విచారం వ్యక్తం చేస్తు్న్నారు. తండ్రిని కోల్పోవడం పట్ల సానుభూతి తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు.
