EPFO PF
Viral, లేటెస్ట్ న్యూస్

EPFO Withdraw: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో పండుగ లాంటి శుభవార్త!

అత్యవసర పరిస్థితులు లేదా ముఖ్యమైన అవసరాల కోసం చాలామంది ఉద్యోగులు పీఎఫ్‌పై (ప్రావిడెంట్ ఫండ్) ఆధారపడుతుంటారు. అయితే, అప్పటికప్పుడు డబ్బు అవసరమైన పరిస్థితుల్లో పీఎఫ్ చందాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగదు ఉపసంహరణ కోసం నిర్దిష్ట సమయం పాటు వేచిచూడాల్సి వస్తుండడం ఇందుకు కారణం. అయితే, ఈ అసౌకర్యానికి ముగింపు పలికేందుకు ఈపీఎఫ్‌వో (EPFO) నిర్ణయించింది. ఈ మేరకు అతిత్వరలోనే కీలకమైన కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది.

యూపీఐ, ఏటీఎంల ద్వారా విత్‌డ్రా
పీఎఫ్ చందాదారులు వెంటనే నగదును ఉపసంహరించుకునేందుకు వీలుగా యూపీఐ, ఏటీఎంల ద్వారా సేవలు అందించేందుకు ఈపీఎఫ్‌వో సమాయత్తమయింది. నిజానికి మే నెలాఖరులోనే ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భావించినా కార్యరూపం దాల్చలేదు. జూన్ నెలలో ఈ నూతన సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యంత కీలకమైన ఈ మార్పు అందుబాటులోకి వస్తే ఉద్యోగులు వెంటనే నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం దక్కుతుంది. తద్వారా, సుదీర్ఘ సమయం పాటు వేచిచూడాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త విధానానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇప్పటికే ఆమోదం తెలపగా, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అమలు చేయనుంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా లక్షలాది ఈపీఎఫ్‌వో​చందాదారులకు పెద్ద ఉపశమనం దక్కడం గ్యారెంటీ.

Read this- Naga Babu: ఏడాది పూర్తి సరే.. మంత్రి పదవి సంగతేంటి?

ఒకేసారి రూ.1 లక్ష వరకు విత్‌డ్రా
ఈపీఎఫ్‌వో తీసుకురానున్న నూతన విధానంపై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా స్పందించారు. ఉద్యోగులు వెంటనే ఒకేసారి రూ. 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే వీలుంటుందని వివరించారు. యూపీఐ ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చని చెప్పారు. పీఎఫ్ అకౌంట్ నుంచి ఎవరికి పంపించాలనుకుంటే వారికి సులువుగా యూపీఐ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుందని ఆమె వివరించారు. తద్వారా ఉద్యోగులు అవసరకాలంలో నగదు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం దక్కుతుందన్నారు. ప్రస్తుతం, పీఎఫ్ నిధులు విత్‌డ్రా చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ సమర్పించాల్సి వస్తోంది. ఆ తర్వాత, ఆమోదం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. అందుకోసం రోజులు లేదా వారాల సమయం కూడా నిరీక్షించాల్సి వస్తోంది. అయితే, యూపీఐ విధానం అమల్లోకి వస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవ్వబోవు. బ్యాలెన్స్‌ చెక్ చేసుకోవడంతో పాటు వెంటనే ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చు.

Read this- Sreeleela: శ్రీలీలకి బిగ్ షాక్.. ఆ హీరోయిన్ తో కార్తీక్ ఆర్యన్ కొత్త జర్నీ స్టార్ట్.. ఫోటోలు వైరల్

విత్‌డ్రా కారణాలు పెంపు
యూపీఐ ద్వారా సేవలు అందించడంతో పాటు పీఎఫ్ సభ్యులకు ఇకపై నగదు ఉపసంహరణ కారణాలను కూడా ఈపీఎఫ్‌వో విస్తరించబోతోంది. వైద్య, అత్యవసర పరిస్థితులతో పాటు, ఇకపై గృహనిర్మాణం, విద్య, పెళ్లి అవసరాల కోసం కూడా నిధులు ఉపసంహరించుకునే అవకాశాన్ని కల్పించాలని ఈపీఎఫ్‌వో భావిస్తోంది. ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్థిక సౌలభ్యాన్ని తీసుకురాబోతోంది. యూపీఐ సేవలు, ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణ సేవలను అందించేందుకుగానూ ఈపీఎఫ్‌వో 120కి పైగా డేటాబేస్‌లను ఇంటిగ్రేట్ చేయనుంది. డిజిటల్ మౌలిక సదుపాయాలను కూడా గణనీయంగా మెరుగుపరచనుందని దావ్రా వివరించారు. నూతన విధానం అమల్లోకి వస్తే క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం గణనీయంగా తగ్గిపోతుందని, 95 శాతం క్లెయిమ్‌లు వాటంతట అవే ప్రాసెస్ అవుతాయని ఆమె పేర్కొన్నారు. పీఎఫ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిచేందుకు మరిన్ని అప్‌గ్రేడ్‌లు కూడా తీసుకొస్తామని ఆమె పేర్కొన్నారు. కాగా, గతంలో, నిర్దిష్ట బ్యాంకు శాఖల నుంచి మాత్రమే నగదు ఉపసంహరణలకు అవకాశం ఉండేది.

Read this- Swetcha Exclusive: మహాధర్నాలో కవిత ప్లాన్ బట్టబయలు .. స్వేచ్ఛ చెప్పిందే నిజమైంది!

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?