Naga Babu Tweet
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Naga Babu: ఏడాది పూర్తి సరే.. మంత్రి పదవి సంగతేంటి?

Naga Babu: మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పరిస్థితేంటి? అనేది ఆ పార్టీ కార్యకర్తలు, మెగాభిమానులకు అస్సలు అర్థం కావట్లేదు. ఎమ్మెల్సీగా ఎన్నిక అయినప్పట్నుంచి అదిగో.. ఇదిగో మంత్రి పదవి అంటున్నారే తప్పితే సుమారు మూడు, నాలుగు నెలల నుంచి ఆ ఊసే లేకుండా పోయింది. అంతేకాదు.. అసలు మంత్రి (Minister) పదవి దక్కుతుందా? లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. ఈ క్రమంలోనే లేనిపోని వార్తలు, కథనాలు మీడియా, సోషల్ మీడియా వేదికగా (Social Media) వైరల్ అవుతున్నాయి. అప్పట్లో క్యాబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అనుకున్నప్పటికీ.. ఆ మధ్య జరిగిన కొన్ని పరిణామాలతో నిర్ణయం మార్చుకున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా.. అసలు అన్నదమ్ముళ్లు క్యాబినెట్‌లో అవసరమా? పైగా కాపు సామాజిక వర్గానికే మళ్లీ పదవి కట్టబెట్టడం ఎంతవరకూ సబబు? అనే ప్రశ్నలు ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్నట్లుగా తెలుస్తున్నది. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిర్ణయం మార్చుకున్నారని.. ఈ దఫా మాత్రం పదవి లేనట్టేనని సమాచారం.

ఈ ట్వీట్‌తో అర్థం చేసుకోవచ్చా?
ఈ క్రమంలోనే జూన్-4న వెన్నుపోటు దినం అని వైసీపీ నిర్వహిస్తుండగా.. కేబినెట్ మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు మీడియా, సోషల్ మీడియా వేదికగా ఓ రేంజిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మెగా బ్రదర్ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కానీ ఇందులో కనీసం టీడీపీ అని పార్టీ పేరు కానీ.. సీఎం చంద్రబాబు ప్రస్తావన అస్సలు తీసుకొని రాలేదు. ఎంతసేపు కూటమి, కూటమి ప్రభుత్వం అని మాత్రమే అన్నారు అంతే. దీంతో టీడీపీ, చంద్రబాబు అంటే నాగబాబు కాసింత గుర్రుగానే ఉన్నారని ట్వీట్ చూసిన అభిమానులు, కార్యకర్తలు అర్థం చేసుకుంటున్నారు. అయితే.. ఈ ట్వీట్ కాసింత అంటీ ముట్టినట్లుగానే ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. మరికొందరేమో మీ వర్షన్ మీరు చెప్పారు కానీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతారా? అంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. ఈ ఏడాదిలో అసలు ఏం చేశారు..? ఏం అభివృద్ధి చేసారు? అమరావతి పనులు ఎందాక వచ్చాయి? పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? అసలు ఐటీ పెట్టుబడులు ఎన్ని వచ్చాయి? ఎంతమందికి మీ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందాయి? కొంచెం వివరిస్తారా? అసలు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పొడవైనా తెలుసా? అని నాగబాబును ప్రశ్నిస్తున్నారు.

Read Also- Savitri: షాకింగ్.. సావిత్రి బంగారు నగలు కొట్టేసిన ‘నటుడు’ ఎవరు?

నాగబాబు ట్వీట్ ఇదే..
‘ సరిగ్గా ఏడాది క్రితం ప్రజా పక్షమైన కూటమికి పరిపాలన కట్టబెట్టిన ప్రజలు కూటమిపై నమ్మకంతో అసలు ప్రతిపక్షం అనే అవకాశమే ఎవరికి ఇవ్వలేదు. వైసీపీ (YSR Congress) చేష్టలు తట్టుకోలేక విసుగు చెందిన ప్రజలు ప్రతిపక్ష హోదా కాదు కదా? రాజకీయాల్లో మళ్లీ నిలదొక్కుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షం హోదా కావాలని గగ్గోలు పెట్టిన వారు చివరికి అందరూ ఊహించినట్టుగానే రాక్షస పక్షం వైపే మేము అనే సందేశాన్ని ఇచ్చేశారు. గొడ్డలి, కోడి కత్తి, గులకరాయి అని అందరూ అంటుంటే నిజంగా ఇవన్నీ చెయ్యడానికి మనసు ఒప్పుతుందా? అనిపించేది, వారు ఎంచుకున్న సంఘ విద్రోహక పక్షాన్ని బట్టి ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. ప్రజలకు మంచి పరిపాలన అందించాలంటే ప్రజలకు మనపై నమ్మకం ఏర్పడేలా మన ప్రవర్తన ఉండాలి కానీ సంఘ విద్రోహక శక్తులకు కొమ్ము కాస్తూ, ప్రజలపైనే దాడి చేస్తామంటే సమాజం ఒప్పుకోదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీడ విరగడై ఏడాది.. స్వర్ణాంధ్రకు (Swarnandhra) శ్రీకారం చుట్టి ఏడాది.. గ్రామాలలో సమూల మార్పులకు ఏడాది.. సుస్థిర పాలనకు- సమగ్రాభివృద్ధికి ఏడాది. కలిసి వేడుకలు జరుపుకుందాం. కూటమి ప్రభుత్వానికి జేజేలు చెబుదాం.. జై జనసేన (Janasena), జై పవన్ కళ్యాణ్, జై హింద్’ అని ఎక్స్ వేదికగా నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు.

Read Also- KTR: అరెరే.. కేటీఆర్‌కు పెద్ద చిక్కొచ్చి పడిందే.. ఆధారాలతో దిమ్మతిరిగేలా కొట్టారుగా!

ఏం చూసి సంబరాలు?
దీనిపై కొందరు నెటిజన్లు, పలువురు వైసీపీ కార్యకర్తలు చిత్ర విచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ ఏం చేశారని సంబరాలు జరుపుకోవాలి. కనీసం కౌన్సిలర్‌గా కూడా గెలవలేని మీరు ఎమ్మెల్సీ అయ్యారని చేసుకోవాలా? కనీసం ఎమ్మెల్యే కూడా కాలేని మీ తమ్ముడు మోదీ దయతో, బాబు అండతో, వర్మ సపోర్ట్‌తో ఏకంగా డీసీఎం అయ్యారనా? ఏం చూసి సంబరాలు జరుపుకోవాలి సార్’ అని సొంత పార్టీ కార్యకర్తలు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితి. ‘ నీకు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చి 6 నెల‌లు దాటిపోయింది. ఇక ఇచ్చేది లేదంటున్నారు. ఏమైందో క‌నుక్కో.. పో’ అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇవన్నీ కాదు సార్.. ఇంతకీ తమరికి ఆంధ్రాలో ఓటు హక్కు ఉందా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. ‘ రాష్ట్ర యువతకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా.. మీరు మాత్రం ఎమ్మెల్సీ జాబ్ తెచ్చుకున్నారు. యువత మీ పల్లకీలు మోయటానికి మాత్రమేనా? ఈ సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? కానీ, మీరు మీ కూటమి వాళ్లు కోటాను కోట్లు అప్పులు మాత్రం చేశారు’ అని నెటిజన్లు మండిపడుతున్నారు.

Read Also- YS Jagan: సీఎం చంద్రబాబును న‌డి రోడ్డుపై కొడ‌తారా?

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?