Hydra News: నగరంలో చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. అంబర్ పేటలోని బతుకమ్మ కుంటతో పాటు పాత బస్తీలోని భమృక్ నుద్దౌలా చెరువును సందర్శించి అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. స్థానిక ప్రజల సూచనలను హైడ్రా కమిషనర్ తెలుసుకున్నారు. బతుకమ్మ కుంటకు ప్రాణం పోశారంటూ స్థానిక ప్రజలు హైడ్రా కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు. చెరువులో నీటి బాతులను చూపించి మురిసిపోయారు. బతుకమ్మ కుంట లోకి వర్షం నీరు చేరే ఇన్ లెట్, చెరువు నిండితే నీరు బయటకు వెళ్ళే ఔట్ లెట్లను పరిశీలించారు.
స్థానికుల కోరిక మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎక్కడ చేపట్టాలనే విషయాన్ని పరిశీలించారు. బతుకమ్మ కుంట పక్కన సాగే మురుగు, వరద కాలువ డైవర్షన్ పనులను కమిషనర్ తనిఖీ చేశారు. హైడ్రా పేరు చెప్పి మూసీ పరీవాహకంలో మట్టి పోస్తున్నారనే ఫిర్యాదులపై స్పందిస్తూ, ఇప్పటికే మట్టి పోస్తున్న వారిని గుర్తించి హెచ్చరించామని, వారం రోజుల్లో వారికి వారే మట్టిని తీసేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. మూసీ పరీవాహకంలో వేసిన మట్టిని తొలగించకపోతే వారిపై కేసులు పెడతామని కూడా రంగనాథ్ హెచ్చరించారు.
Also Read: Bhu Bharati Act: దేశంలోనే భూభారతి చట్టం.. అగ్రగామిగా నిలుస్తోంది!
పాతబస్తీకి మణి హారం భమృక్ నుద్దౌలా
పాతబస్తీలోని భమృక్ నుద్దౌలా చెరువు పనులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. 18 ఎకరాల చెరువు అసలు విస్తీర్ణం కాగా,9 ఎకరాల మేర మట్టి నింపి ఆక్రమించిన విషయం తెల్సిందే. 9 ఎకరాల్లో మట్టిని తొలగించి మొత్తం 18 ఎకరాల మేర చెరువును హైడ్రా పునరుద్దరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చెరువు ఔట్ లెట్లను తెరిపించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. స్థానికులు కమిషనర్ కలిసి చెరువు అభివృద్ధి పనుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పాతబస్తీకి ఈ చెరువు మనోహారం కాబోతోందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇక్కడ పార్క్ ను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. చెరువు అభివృద్ధిలో భాగంగా పిల్లలకు ఆట స్థలం, చెరువు చుట్టూ నడక దారి అందుబాటులోకి వస్తోంది అని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు చెప్పారు. చెరువు తయారవుతుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడకు రావాలంటే గతంలో భయం వేసేది మురుగునీటితో నిండిన చెరువు వల్ల దోమలు వచ్చేవి. ఈ పరిసరాలు ఆహ్లాదంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.
Also Read: Actress Laya: బాలయ్య అంత పని చేశాడా? షాకింగ్ విషయం చెప్పిన నటి లయ!