Actress Laya: నటి లయ అందరికీ కాకపోయినా కొందరికైనా గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్‌గా స్టార్ హీరోల చిత్రాలలో నటించిన లయ, ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు సంసార బాధ్యతలను చక్కబెట్టుకుని నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. నితిన్ (Nithiin) హీరోగా నటిస్తున్న‘తమ్ముడు’(Thammudu) చిత్రంతో ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలో మరిన్ని అవకాశాల కోసం ఆమె టాలీవుడ్‌లో సందడి చేస్తోంది. టీవీ ప్రోగ్రామ్స్‌కు అటెండ్ అవడంతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ ఇంటర్వ్యూలో తను హీరోయిన్‌గా చేసినప్పటి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెడుతూ.. తన పేరును ఇండస్ట్రీలో మాట్లాడుకునేలా చేస్తోంది. తాజాగా ఆమె నందమూరి నటసింహం బాలయ్య గురించి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
Also Read- Ritu Varma: అందుకే, ఇంత వరకు ఆ పని చేయలేదు
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తో కలిసి ఆమె ఓ సినిమాలో నటించింది. ‘విజయేంద్ర వర్మ’ (Vijayendra Varma) అనే టైటిల్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటించారు. అందులో ఒకరు లయ. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో బాలయ్య ప్రవర్తనకు సంబంధించిన విషయాన్ని ఆమె ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు. సినిమా షూటింగ్‌కు ముందు ఓ సీన్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా, సడెన్‌గా బాలయ్య కాలుని లయ తొక్కేసిందట. ఆమె అసలు చూసుకోలేదట. చూసుకోకుండా జరిగిన ఈ సంఘటన బాలయ్యకు కోపాన్ని తెప్పించిందని, వెంటనే ఆయన ఫేస్ సీరియస్‌గా మారిపోయిందని లయ చెప్పుకొచ్చింది. అంతేకాదు, వెంటనే దర్శకుడిని పిలిచి అర్జెంట్‌గా ఈ అమ్మాయిని ఈ సినిమాలో నుంచి తీసేయండి అని హుకుం జారీ చేశారట. దర్శకుడితో ఆ మాట చెబుతుండటం తను కూడా విన్నానని తెలిపింది.
Also Read- Chiranjeevi: మీలాంటి ఒక అభిమాని వున్నందుకు గర్వంగా ఉంది.. చిరు ట్వీట్ వైరల్!
అసలే పెద్ద హీరో సినిమా. బాలయ్య వంటి హీరో పక్కన ఛాన్స్ రావడమే కష్టం. కానీ తన తప్పు లేకుండా, ఇలా జరగడంతో లయ చాలా బాధపడిపోతూ కూర్చుందట. తను బాధపడటం చూసిన బాలయ్య.. మళ్లీ తన దగ్గరకు వచ్చి.. ‘నిన్నేం తీసేయడం లేదులే.. నేను సరదాగా ఆటపట్టించాను’ అని బుజ్జగించారట. ఆయన బుజ్జగించిన తీరు ఇప్పటికీ గుర్తుందని, అవి మరిచిపోలేని క్షణాలని లయ వెల్లడించింది. అందరూ బాలయ్యని సీరియస్‌గా ఉంటారని అంటుంటారు. కానీ ఆయన షూటింగ్‌లో చాలా సరదాగా ఉంటూ అందరినీ ఆటపట్టిస్తుంటారని లయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తుండగా, కొన్ని పాజిటివ్ కామెంట్స్‌తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. బాలయ్య ఎలాంటి వాడో, సెట్స్‌లో ఎలా ఉంటాడో? ఇప్పటికైనా తెలుసుకోండిరా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే.. ఏదో పైకి అలా చెబుతుంది కానీ, అసలు విషయం ఏంటో ఆమెకు కూడా తెలుసులే.. అంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు