Chiranjeevi: మీలాంటి ఒక అభిమాని వున్నందుకు గర్వంగా ఉంది
Chiranjeevi and Sekhar Kammula
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi: మీలాంటి ఒక అభిమాని వున్నందుకు గర్వంగా ఉంది.. చిరు ట్వీట్ వైరల్!

Chiranjeevi: ఒక అభిమాని.. తనని స్ఫూర్తిగా పొంది, సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ని లీడ్ చేస్తుంటే.. ఏ హీరోకైనా సంతోషంగానే ఉంటుంది. అందులోని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులే వేరు. అభిమానుల అభిమానాన్ని సరికొత్త మార్గంలో నడిపించి, వారి గురించి కూడా మాట్లాడుకునేలా, వారిని కీర్తించేలా చేసిన హీరో ఎవరయ్యా? అంటే, కచ్చితంగా అందరూ చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. తను హీరోగా ఉన్నత స్థానానికి చేరుకోవడమే కాకుండా, అభిమానులకు కూడా అంతే గౌరవాన్ని ఆపాదించి, వారిని సేవా మార్గం వైపు నడిచేలా చేశారు చిరంజీవి. అందుకే అభిమానులందరూ మెగాభిమానులు వేరయ్యా! అంటారు. ఈ రోజు చిరంజీవి బ్లడ్ బ్లాంక్, ఐ బ్యాంక్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నాయంటే కారణం ఆయన అభిమానులే. ఆ విషయం స్వయంగా మెగా హీరోలే చెబుతుంటారు. ఇక విషయంలోకి వస్తే.. తనని స్ఫూర్తిగా తీసుకుని, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి.. దర్శకుడి ఎనలేని కీర్తిని గడించిన దర్శకుడు శేఖర్ కమ్ముల.

Also Read- The Raja Saab : ప్ర‌భాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటే?

ఆయన ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఓ ఎమోషనల్ మెసేజ్‌ని షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ‘‘టీనేజ్‌లో ఒక్కసారి చూశాను చిరంజీవిగారిని. దగ్గరగా చూశాను. ‘ఈయనతో సినిమా తీయాలి’ అనే ఫీలింగ్.. అంతే నేను ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు. ‘లెట్స్ సెలబ్రేట్’ అని మా టీమ్ అంటే నాకు గుర్తొచ్చింది ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవే. కొన్ని జనరేషన్స్‌ని ఇన్‌స్ఫైర్ చేసిన పర్సనాలిటీ ఆయన. కలల్ని సాకారం చేసుకునే క్రమంలో సక్సెస్ మనల్ని ఫాలో అయి తీరుతుందనే నమ్మకం ఇచ్చింది చిరంజీవిగారే. సో.. నా 25 సంవత్సరాల జర్నీ సెలబ్రేషన్ అంటే ఆయన సమక్షంలోనే చేసుకోవాలని అనిపించింది. థ్యాంక్యూ సార్. ఈ మూమెంట్స్‌లోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు’’ అని శేఖర్ కమ్ముల తన ఫేస్ బుక్ అకౌంట్ వేదికగా ఓ ఎమోషనల్ మెసేజ్‌ని షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ మెసేజ్‌కు మెగాస్టార్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ.. శేఖర్ కమ్ముల (Sekhar Kammula)ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

Also Read- Covid-19 Cases India: కరోనా డేంజర్ బెల్స్.. ఏకంగా 4వేల కేసులు.. ఆందోళనలో ప్రభుత్వాలు!

‘‘మై డియర్ శేఖర్ (శేఖర్ కమ్ముల), మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 ఏళ్ల జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది. సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్‌ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిలిం మేకింగ్‌లో మీ కంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు మరెన్నో జనరంజకమైన సినిమాలు ‘వ్రాస్తూ’, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. Best wishes and Hearty Congratulations on this fantastic milestone. Here’s to your next glorious 25 years. God Bless!!’’ అని మెగాస్టార్ చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!