Suravaram Pratap Reddy University: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో వివిధ రెగ్యులర్ కోర్సుల ప్రవేశాలకు యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తెలుగు యూనివర్సిటీ నిర్వహించే శిల్పం-చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, శాస్త్రీయ నృత్యం(కూచిపూడి, ఆంధ్రనాట్యం), జానపదం, తెలుగు, చరిత్ర-పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం, యోగా కోర్సుల కోసం ఎంఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రాంలలో అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చిన సూచించారు.
Also Read: Ganja Seized: స్కూల్ వద్ద గంజాయి అమ్మకాలు.. నలుగురి అరెస్ట్–3.8కిలోల గంజాయి సీజ్!
నోటిఫికేషన్ వివరాల కోసం www.teluguuniversity.ac.in లేదా www.pstucet.org వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. దరఖాస్తు గడువు జూన్ 24 వరకు ఉందన్నారు. కాగా ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు అప్లికేషన్ కు అవకాశం కల్పించనున్నట్లు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.
Also Raed: Coronavirus In TG: కొవిడ్ సీజనల్ అలర్ట్.. ప్రజల ఆరోగ్యం కోసం ముందస్తు ప్లాన్!
