Master Bharath: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మాస్టర్ భరత్ మాతృవియోగానికి లోనయ్యారు. మాస్టర్ భరత్ ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించి, ఈ మధ్యే హీరోగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఆయన తన మాతృమూర్తిని కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం. ప్రతి తల్లి తన కొడుకు ప్రయోజకుడైతే చూడాలని ఎంతో మురిసిపోతూ ఉంటుంది. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కొడుకు సక్సెస్‌ని చూసిన ఆమె, ఇప్పుడే హీరోగా మారుతున్న తన కుమారుడి భవిష్యత్‌ని చూడకుండానే వెళ్లిపోయారు.
Also Read- Balayya and Mansion House: బాలయ్యని అలా అపార్థం చేసుకోకండి.. పూర్తిగా చూడండయ్యా!
నటుడు భరత్ మాతృమూర్తి పేరు కమలహాసిని. ఆమె చెన్నైలో ఆదివారం (మే 18) సాయంత్రం 8 గంటలకు కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమె అకాల మరణంతో భరత్ కుటుంబమే కాకుండా, సినిమా ఇండస్ట్రీ సైతం దిగ్భ్రాంతికి లోనవుతుంది. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు తన కుమారుడిని ఎంతగానో ప్రోత్సహించిన కమలహాసిని ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చారని, ఆమె సడెన్‌గా ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధగా ఉందంటూ భరత్ సన్నిహితులు ఆ కుటుంబానికి ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కమలహాసిని మృతికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ సంతాపం తెలియజేస్తోంది.
Also Read- Naa Anveshana: రాత్రి కూడా వచ్చింది.. శ్రీముఖి బండారం బయటపెట్టేశాడు!
మాస్టర్ భరత్ విషయానికి వస్తే.. అందరికీ ఆయన చిట్టినాయుడుగా పరిచయమే. ‘ఢీ, రెడీ, కింగ్, వెంకీ, బిందాస్’ వంటి దాదాపు 100కి పైగా చిత్రాల్లో ఆయన ఛైల్డ్ కమెడియన్‌గా ప్రేక్షకులని అలరించారు. ఇటీవల అల్లు శిరీష్ హీరోగా నటించిన ABCD అనే చిత్రంలో సెకండ్ హీరోగా కనిపించారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. పెద్దవాడైనప్పటికీ ఇప్పటికీ అమ్మచాటు బిడ్డనే అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఎన్నో కష్టాలను అనుభవించానని, కుడి కన్ను సరిగా కనిపించదని, అయినా కూడా నా ప్రతి అడుగులో అమ్మ సపోర్ట్ మరిచిపోలేనిదని భరత్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు