Balayya and Mansion House
ఎంటర్‌టైన్మెంట్

Balayya and Mansion House: బాలయ్యని అలా అపార్థం చేసుకోకండి.. పూర్తిగా చూడండయ్యా!

Balayya and Mansion House: వెండితెరపై 50 సంవత్సరాలుగా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నందమూరి నటసింహం బాలయ్యని ఇటీవల పద్మ భూషణ్ వరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారాన్ని అందుకున్న తర్వాత హిందూపూర్‌లో బాలయ్యకు గ్రాండ్‌గా సన్మాన సభ నిర్వహించారు. అక్కడ బాలయ్య మాట్లాడిన కొన్ని మాటలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ మాటలను పక్కన పెడితే.. ఇప్పుడు బాలయ్యని అపార్థం చేసుకుని, ఆయనపై లేనిపోని కామెంట్స్ చేస్తున్నారు. ఏమని అపార్థం చేసుకున్నారు? ఏంటా కామెంట్స్ అని అనుకుంటున్నారు కదా? విషయంలోకి వస్తే..

Also Read- Naa Anveshana: రాత్రి కూడా వచ్చింది.. శ్రీముఖి బండారం బయటపెట్టేశాడు!

బాలయ్య అంటే మ్యాన్షన్ హౌస్.. మ్యాన్షన్ హౌస్ అంటే బాలయ్య అనేలా ఒక బ్రాండ్ పడింది. ఆయన హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ షో‌ని కూడా ఈ మద్యం బ్రాండే సమర్పించడం విశేషం. ఇప్పుడీ బ్రాండ్‌కు బాలయ్య బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. అంతే, బాలయ్యని రకరకాల కామెంట్స్‌తో నెటిజన్లు ఏసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే, థమ్సప్‌లో అనారోగ్యమైనవి కలుస్తున్నాయని, ఆ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా చేసిన చిరంజీవి తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. అలాంటి వాళ్లతో పోలుస్తూ బాలయ్యని టార్గెట్ చేస్తున్నారు.

ది లెజెండ్ నందమూరి తారక రామారావు వారసుడివి, పద్మ భూషణ్ అవార్డు గ్రహీతవి.. అయినా కొంచమైనా బాధ్యత ఉండక్కర్లా? అంటూ కాస్త స్ట్రాంగ్‌‌గానే బాలయ్యపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఎందుకూ అంటే, ఎన్నోసార్లు తన బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ అని బాలయ్య ప్రకటించారు. ఆయన హోస్ట్ చేసే షో లో కూడా ఈ బ్రాండ్ గురించి కుర్ర హీరోలతో ఆయన చర్చించారు. పబ్లిగ్గా వాటర్ బాటిల్‌లో మద్యం పోసుకుని ఓ ఈవెంట్‌కు ఆయన హాజరైనట్లుగా ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఆ బ్రాండ్‌కి అంబాసిడర్ అనగానే, ఆ మాత్రం టార్గెట్ అవకుండా ఎలా ఉంటారు? అయితే, ఇక్కడే అందరూ పప్పులో కాదు తప్పులో కాలేశారు.

Also Read- Vishnu Manchu: ప్రభాస్‌ను పొగుడుతూ.. మంచు మనోజ్‌పై విమర్శలు!

నిజంగానే బాలయ్య మ్యాన్షన్ హౌస్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నారు. కాకపోతే అది మద్యం కాదు. డ్రింకింగ్ వాటర్. ఆ యాడ్‌ని కూడా సరిగా చూడకుండా, మ్యాన్షన్ హౌస్ కనబడగానే అంతా బాలయ్యని అపార్థం చేసుకుని, ట్రోల్ చేస్తున్నారు. ముందు ఆ యాడ్‌ని సరిగా చూడండయ్యా? అంటూ నందమూరి ఫ్యాన్స్ కౌంటర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయినా, బాలయ్య తను తాగుతాను అని చెప్పాడు కానీ, ఆ బ్రాండ్‌ని తాగమని ఏ హీరోకి, ఏ అభిమానికి ఆయన సజెస్ట్ చేయలేదు. ఆ విషయం గమనించకపోతే ఎలా? బాలయ్యకు సమాజం పట్ల చాలా బాధ్యత ఉంది. ఆ విషయం ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాయి. అయినా కూడా ట్రోల్ చేస్తున్నారంటే, అలాంటి వాళ్లకి బుద్ధి లేదనే అనుకోవాలి అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అది మ్యాటర్.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?