Naa Anveshana: ఐపీఎల్ పున: ప్రారంభమైంది కాబట్టి.. బెట్టింగ్ యాప్ ఉద్యమం కూడా ప్రారంభిస్తున్నానంటూ మరో ఇద్దరి భాగోతాన్ని బయటపెట్టాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్. ఇప్పటి వరకు ఆయన బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న ఎంతో మంది గురించి ఆయన వీడియోలు చేశారు. ఇప్పుడు బెట్టింగ్ ఫ్యామిలీకి రాజు, రాణి వీళ్లే అంటూ ఇద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్ ఫ్యామిలీకి రాజు.. ఆదిరెడ్డి అయితే, రాణి శ్రీముఖి. వీళ్లిద్దరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఫస్ట్ ఆదిరెడ్డి విషయానికి వస్తే.. ఈయనకు రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయ్. ఆయనది ఒకటి, ఆయన భార్యది ఒకటి. ఇంకా సోషల్ మీడియా అకౌంట్స్‌లు ఉన్నాయి. బిగ్ బాస్ షోకి వెళ్లక ముందు రివ్యూలు చెప్పాడు. ఆ తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లాడు. మళ్లీ వచ్చిన తర్వాత రివ్యూలు చెబుతున్నాడు. ఎటు చూసినా ఆదాయమే. ఎటూ కదలకుండా కుర్చీలో కూర్చుని సంపాదిస్తున్నాడు. అయినా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. అవసరమా ఆదిరెడ్డి నీకు.
Also Read- Jr NTR Birthday: తారక్ బర్త్‌డే.. ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్!
ఆదిరెడ్డి గురించి చెప్పాలంటే.. ఈ అబ్బాయి బిగ్ బాస్ షోకి వెళ్లే ముందు కూడా నాకు హాయ్ బ్రో అని మెసేజ్ చేశాడు. నేను షోకి వెళుతున్నాను.. సపోర్ట్ చేయమని పెట్టాడు. నేను పల్లవి ప్రశాంత్‌కి ఏదయితే చెప్పానో.. ఆదిరెడ్డికి కూడా చేయనని చెప్పేశాను. ఈ అబ్బాయిది కటిక పేద కుటుంబం. ఎప్పుడైతే బిగ్ బాస్‌కి సెలక్ట్ అయ్యాడో.. లక్ష్మీదేవి ఇంట్లో కూర్చుంది. బిగ్ బాస్ షో చూసి.. ఆ షో లో ఏం జరిగింది? అనేది చెప్పడమే రివ్యూ. టెలిగ్రామ్ వంటి వాటిలో చాలా అకౌంట్స్ ఉన్నాయి. అన్నీ డిలీట్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 6కి హౌస్‌లోకి వెళ్లాడు. వెళ్లి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి కటాక్షం ఎలా ఉంటుందో, ఆయనకి తెలిసింది. సీజన్ 7కి రివ్యూలు చెప్పిన నాలుగు నెలలకే రూ. కోటి వచ్చాయి. ఇది ఎంత అదృష్టం. ఒక షో చూసి రివ్యూ చెప్పి డబ్బులు సంపాదించడం. లైఫ్ సెటిల్ అయిపోయినట్లేగా. ఆ తర్వాత వచ్చినవి పక్కన పెట్టినా, ఆ నాలుగు నెలలు దిట్టంగా సంపాదించాడు. ఆది రెడ్డికి ఏం ఖర్చు కూడా లేదు. మరి అలాంటి అవకాశం ఇచ్చిన ప్రజల్ని ఎలా మోసం చేయాలని అనిపించింది. ఫాంటసీ యాప్‌లు ఏపీ, తెలంగాణలో బ్యాన్‌లో ఉన్నాయి. వాటిని నువ్వెలా ప్రమోట్ చేశావు. అంత సంపాదించావు.. ఒక్కరినైనా ఆదుకున్నావా? నీకొచ్చిన ఇమేజ్‌కి నువ్వు ఏం చేసినా, డబ్బులు సంపాదించవచ్చు. అయిందేదో అయిపోయింది. ఇంకెప్పుడూ ఇలాంటివి చేయకు.
Also Read- Vishal marriage: విశాల్ పెళ్లి ప్రకటన వచ్చేది ఆరోజే.. వధువు ఎవరో తెలుసా?
ఇక శ్రీముఖి విషయానికి వస్తే.. ఆమె టాప్ మోస్ట్ యాంకర్. శ్రీముఖి కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి వచ్చారు. నాగార్జున ఆశీర్వాదం తీసుకుని వచ్చారు. వెళ్లి వచ్చిన వెంటనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. రాత్రి కూడా వచ్చింది. మరి మేడమ్ ఆగలేకపోతున్నారో ఏమో తెలియదు కానీ, రాత్రి కూడా ఆమె ప్రమోట్ చేస్తున్న పాప్ అప్ యాడ్ వచ్చింది. లక్షల రూపాయలు తీసుకుని, పలానా యాప్ వాడండి అని వీళ్లు వీడియో చేసి పంపితే.. వాడు ఏ దేశంలోనైనా ఆ వీడియోని వాడుకుంటాడు. వాడి ఇష్టం. ఒక్కసారి వీళ్ల పిలక వాడి చేతిలోకి ఇస్తే.. ఆ పిలకని వాడు అలా తిప్పుతూనే ఉంటాడు. నాకు సంబంధం లేదని శ్రీముఖి చెప్పినా సరే.. వాళ్లు వాయిస్ మార్చి మరి పంపిస్తున్నారు. ఎవరు చేసినా తప్పు తప్పే. మీకు ఏం తక్కువైందని ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇన్‌స్టాలో 5 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అంటే ఒక పెద్ద సెలబ్రిటీకి ఉన్న రేంజ్.
ఒక లిప్‌స్టిక్ పెట్టుకున్నా, ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లినా లక్షల్లో డబ్బులు వస్తాయి. అవన్నీ వదిలేసి ఇలాంటివి చేయడం అవరసమా? ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. మీరు ఏ ఫంక్షన్‌కు యాంకరింగ్ చేసిన డబ్బులే డబ్బులు. అవన్నీ వదిలేసి ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. దయచేసి ఇంకెప్పుడూ చేయకండి. ఎవరైనా చేసినా, మీరే నోటీస్ చేయాలి. నేను ఏ సబ్‌స్క్రైబర్‌కీ అన్యాయం చేయలేదు. వాళ్లకి కావాల్సినంత ఫన్ ఇచ్చాను. వాళ్లకి హానికరమైనవి ఏమీ చేయలేదు. హాని తలపెట్టే వారి నుంచి కాపాడాను. ఎంత పుణ్యమో చూడండి. అలా ఉండాలి కానీ, సబ్‌స్ర్కైబర్‌ని ఇబ్బంది పెడితే మనకేం వస్తుంది. ఇకనైనా కాస్త బాధ్యతగా ఉండండి.. అంటూ నా అన్వేష్ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు