Jr NTR
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR Birthday: తారక్ బర్త్‌డే.. ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్!

Jr NTR Birthday: మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే‌ని పురస్కరించుకుని మే 20న ఒక గుడ్ న్యూస్ రాబోతుంటే, ఫ్యాన్ ఎంతగానో ఎదురు చూస్తున్న వారి నుంచి మాత్రం ఓ బ్యాడ్ న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది. అవును.. నిజంగా ఫ్యాన్స్‌ను ఇది డిజప్పాయింట్ చేసే వార్తే. మాములుగా అభిమాన హీరో బర్త్‌డే అంటే, ఫ్యాన్స్ అంతా ఏం ఊహిస్తారు. ఆయన చేస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, టీజరో లేదంటే ట్రైలరో, ఇంకా లేదంటే ఓ పాటో, గ్లింప్సో ఊహిస్తారు. హీరోలు కూడా వారి అభిమానులను తమ బర్త్‌డే రోజు ఖుషీ చేయాలని, ఇలాంటివి ప్లాన్ చేయిస్తుంటారు. రాబోయే ఎన్టీఆర్ బర్త్‌డేకు కూడా ట్రీట్ అయితే ఉంది కానీ, ఆయన ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుంటే, ఒక సినిమా నుంచి మాత్రమే గుడ్ న్యూస్ వచ్చింది. మరో సినిమా టీమ్ నుంచి బ్యాడ్ న్యూస్ వచ్చింది.

Also Read- Vishal marriage: విశాల్ పెళ్లి ప్రకటన వచ్చేది ఆరోజే.. వధువు ఎవరో తెలుసా?

ముందుగా గుడ్ న్యూస్ విషయానికి వస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) డైరెక్ట్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పుట్టినరోజున మిస్సైల్ లాంటి అప్డేట్‌ రాబోతున్నట్లుగా నిర్మాణ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజును ‘వార్ 2’తో చేసుకుందామంటూ ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. ఇది ‘వార్ 2’ టైమ్. మాకు ఈ సినిమా ఎంతో గౌరవంతో కూడుకున్నది. ఒక మారణహోమాన్ని స్టార్ట్ చేసే ముందు.. ఈ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుందాం. మన మాస్ మిస్సైల్‌ను కరెక్ట్ సమయంలో వదులుదాం..’’ అంటూ ‘వార్ 2’ సినిమాకు సంబంధించి ఏదో భారీగా ప్లాన్ చేసినట్లుగా నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు.

Also Read- Oh Bhama Ayyo Rama: పెళ్లిపై అదిరిపోయే సాంగ్.. ఇక మోత మోగిపోతుందేమో!

కాకపోతే.. ఇది ‘వార్ 2’ టైమ్ అన్నారని, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్‌ని ఆ చిత్ర నిర్మాతలు వాయిదా వేశారు. వాస్తవానికి ఎన్టీఆర్ బర్త్‌డేకు ట్రీట్ ఉంటుందని, ఎన్టీఆర్‌నీల్ (NTRNeel) ఫిల్మ్ మేకర్స్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ ‘వార్ 2’ అప్డేట్ వస్తుండటంతో.. ఎన్టీఆర్‌నీల్ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ ఉండదని మేకర్స్ క్లారిటీగా చెప్పేశారు. మంచి సమయం చూసుకుని ఈ మిస్సైల్‌ను దించుతామని వారు హామీ ఇచ్చారు. ఇదే బ్యాడ్ న్యూస్. ఎందుకంటే, ఈ సినిమా అప్డేట్ కోసమే ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వేచి చూస్తున్నారు. చివరి నిమిషంలో నిర్మాణ సంస్థ ఇలా ఝలక్ ఇవ్వడంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరోవైపు తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటించిన ‘యమదొంగ’ చిత్రాన్ని మే 18న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది ఫ్యాన్స్‌కు బోనస్ లాంటిది. ఎలా చూసినా ఈ మూడు నాలుగు రోజులు ఎన్టీఆర్ పేరు సౌత్, నార్త్‌లతో మారుమోగడం మాత్రం పక్కా అనేలా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం