Vishnu Manchu: ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియంది కాదు. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఆ గొడవలను తీర్చలేక మంచు మోహన్ బాబు కూడా చేతులెత్తేశారు. మంచు మనోజ్ తనకు అన్యాయం జరిగిందంటూ రోడ్డు మీదకు వచ్చేశాడు. మీడియాను పిలుచుకుని వెళ్లి.. ఎక్కడబడితే అక్కడ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతా తన అన్న మంచు విష్ణు, ఆయన అనుచరులే చేస్తున్నారంటూ మీడియా ముందు, అది నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు మాత్రం కామ్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇంత జరుగుతున్నా, ఇవేం నాకు పట్టవు అన్నట్లుగా, నవ్వుతూ నాలుగు మాటలు మాట్లాడేసి.. ఇదసలు తన దృష్టిలో ఇష్యూనే కాదన్నట్లుగా ఇప్పటి వరకు బిహేవ్ చేస్తూ వచ్చాడు. కానీ, మనసులో ఎంత బాధ ఉందో, తాజాగా జరిగిన ‘కన్నప్ప’ ప్రమోషన్స్ ఆయన బయటపెట్టేశాడు.
Also Read- Bhairavam Trailer: ఎదుటోడు మనమీద కన్నేశాడంటే.. మనం వాడి మీద మన్నేసేయాలి.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘కన్నప్ప’ (Kannappa) చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఎక్కడా చూసినా మంచి విష్ణునే కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం అమెరికాలో కూడా ప్రమోషన్స్ నిర్వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించిన ప్రభాస్ (Rebel Star Prabhas) పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. నిజంగా సోదరుడంటే ప్రభాసే అనేలా ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మంచు విష్ణు ఏమన్నారంటే..
‘కన్నప్ప’లో ప్రభాస్ రోల్ గురించి వచ్చిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రభాస్, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ స్నేహం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. నిజంగా ప్రభాస్ ఎంత గొప్ప నటుడంటే, ఆ విషయం ఆయనకి కూడా తెలియదు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. సినిమాల్లోకి వచ్చినప్పుడు అందరూ చాలా సింపుల్‌గానే ఉంటారు. కానీ, పాన్ ఇండియా రేంజ్ స్టార్‌డమ్ వచ్చినా కూడా, ఇంకా ప్రభాస్ అలానే ఉన్నాడు. నిజంగా ఇది రెబల్ స్టార్ గ్రేట్‌నెస్. రక్తం పంచుకుని పుట్టిన వాళ్లు ఈ రోజు నా పతనాన్ని కోరుకుంటున్నారు. కానీ ప్రభాస్, నేను రక్తం పంచుకుని పుట్టకపోయినా, అతను నేను అడిగిన ఒకే ఒక్క మాట కూడా ఈ సినిమాలో చేశాడు. మేము ఎప్పటికీ సోదరులమే. ఆయనకి ఎప్పటికి రుణపడి ఉంటానంటూ విష్ణు చెప్పుకొచ్చారు.
Also Read- Naa Anveshana: రాత్రి కూడా వచ్చింది.. శ్రీముఖి బండారం బయటపెట్టేశాడు!
ప్రస్తుతం మంచు చెప్పిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. మనసులో ఇంత పెట్టుకుని పైకా ఎలా అలా నటిస్తున్నావ్ అంటూ మంచు మనోజ్ (Manchu Manoj) ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నీకోసం మంచు మనోజ్ ఏమేం చేశాడో గుర్తుకు తెచ్చుకో. నీకోసం ఆడ వేషం కూడా వేశాడు. ఫైట్స్ కంపోజ్ చేశాడు. అయినా కూడా అలా ఎలా అంటావ్? ఇప్పుడు పక్కన పెట్టిన నీ తమ్ముడే, రేపు నీకు అన్నీ అవుతాడేమో చూసుకో అంటూ ఓ రేంజ్‌లో విష్ణుపై కౌంటర్స్ సంధిస్తున్నారు. మరి ఈ కౌంటర్స్‌పై విష్ణు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు