Bhairavam Trailer: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న మల్టీ హీరోల మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘భైరవం’. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలు, ఇంకా ఇతర ప్రమోషనల్ కంటెంట్ అద్భుత స్పందనను రాబట్టుకొని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్న ఈ సినిమా మే 30న ఈ వేసవికి వీడ్కోలు పలుకుతూ బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ టీమ్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Also Read- Naveen Chandra: నవీన్ చంద్ర రేంజ్ పెరిగింది.. ఒక్కరు కాదు, ఇద్దరితో ‘కరాలి’!
ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. చాలా రోజుల తర్వాత మల్టీ హీరోల సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏ హీరో ఇమేజ్ తగ్గకుండా, ప్రతి హీరోకి పవర్ ఫుల్ నేపథ్యం పెట్టి దర్శకుడు రూపొందించిన ఈ ‘భైరవం’ చిత్రం ఈ ట్రైలర్‌తో ఇంకాస్త ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమా కథాంశం గ్రామస్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక అయినటువంటి పవిత్ర వారాహి ఆలయం చుట్టూ తిరుగుతుందనేది ఈ ట్రైలర్ స్పష్టం చేస్తుంది. దేవాలయ భూములపై కన్నేసిన మంత్రి.. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని దుర్వినియోగం చేయాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గ్రామంలో శాంతి భంగం అవుతుంది. అప్పుడు ముగ్గురు స్నేహితులు కలిసి, ఆలయాన్ని, దాని వారసత్వాన్ని రక్షించేందుకు ఏ విధంగా నిలబడ్డారు. వారి మధ్య ఉన్న బంధం, ధైర్యం గ్రామ ప్రజలకు ఏవిధంగా ఆశను నింపింది? అనేదే ఈ సినిమా. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ఫ్యాక్డ్‌గా ఉంటూ, మంచి డ్రామా ఇందులో ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. (Bhairavam Trailer Talk)
Also Read- Ravi Teja: ఆ స్టార్ హీరోయిన్ తో ఘాటు లిప్ లాక్ కోసం రవితేజ అంత పని చేశాడా?
కమర్షియల్ వ్యాల్యూస్‌తో కూడిన కథను దర్శకుడు విజయ్ కనకమేడల ఎక్జయిటింగ్, ఇంపాక్ట్ ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. తొలి షాట్ నుండి చివరి ఫ్రేమ్ వరకు సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారనే విషయం ఈ ట్రైలర్ చూస్తుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) పాత్రలో వెర్సటాలిటీని చూపించారు. ముఖ్యంగా శివ తాండవం సీక్వెన్స్, చివరిలో వచ్చే యాక్షన్ సన్నివేశంలో ఆయన దూసుకెళ్లాడనే చెప్పుకోవాలి. మంచు మనోజ్ (Manchu Manoj) ఇంటెన్స్ క్యారెక్టర్, డైలాగ్స్‌తో అరిపించేశాడు. నారా రోహిత్ (Nara Rohith) పాత్ర కూడా ఇద్దరి హీరోలకూ ధీటుగా ఉందనేది తెలుస్తుంది. మొత్తంగా అయితే, ఈ ముగ్గురు నటుల పెర్ఫార్మెన్స్ వావ్ ఫ్యాక్టర్‌ని క్రియేట్ చేస్తుంది. ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై హీరోయిన్లుగా నటించారు. సాంకేతికంగానూ ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉండబోతుందనే విషయాన్ని ట్రైలర్ అడుగడుగునా తెలియజేసింది. ముఖ్యంగా కెమెరా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ అదిరిపోయాయి. మే 30న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే హింట్‌ని ఇవ్వడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు