Drive OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన ఆది పినిశెట్టి ‘డ్రైవ్’..
drive-ott(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Drive OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన ఆది పినిశెట్టి ‘డ్రైవ్’..

Drive OTT: ఆది పినిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘డ్రైవ్’ (Drive) ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా నేడు జనవరి 2, 2026 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. బాలయ్య బాబు అఖండ 2 సినిమా రోజునే ఈ సినిమా కూడా థియేటర్ల లోకి వచ్చింది. ప్రచారంలో లోపం వల్ల ఈ సినిమా ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేదు. విడుదలైన మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో ఈ సినిమా చూడాలనుకునే ఆది పినిశెట్టి అభిమానులు కోసం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి కి జోడీగా మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్గా నటించింది. రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీష్ కురువిల్లా తదితరులు ప్రధాన తారాగణం. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 12, 2025న థియేటర్లలో విడుదలైంది. అఖండ 2 తో పాటు విడుదల అయినా ఓటీటీకి మాత్రం మూడు వారాలకే వచ్చేసింది. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయినా, ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్. ప్రస్తుతం ఇది తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భషల్లో ఆందుబాటులో ఉంది. ఈ సినిమా విశేషం ఏమిటంటే.. ఒకే రోజు ఆది పినిశెట్టి రెండు సినిమాలు విడుదల అయ్యాయి. అఖండ 2 లో ఆది విలన్ గా నటించారు. డ్రైవ్ సినిమాలో హీరోగా నటించారు.

Read also-Pawan Impact: పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా రేంజ్ అలాంటిది మరి.. నిధి అగర్వాల్ ఏం చెప్పారంటే?

ఆది పినిశెట్టి నటించిన ‘డ్రైవ్’ ఒక సైబర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. జయదేవ్ రెడ్డి (ఆది పినిశెట్టి) ఒక మీడియా టైకూన్. తన కుటుంబంతో కలిసి లండన్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే, ఒక అజ్ఞాత హ్యాకర్ జయదేవ్ జీవితంలోకి ప్రవేశించి, అతని రహస్యాలను బయటపెడతానని బెదిరిస్తాడు. ఆ హ్యాకర్ ఇచ్చే టాస్క్‌ల వల్ల జయదేవ్ జీవితం ఎలా తారుమారైంది? చివరికి అతను ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాడు? అనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తంగా సాగుతోంది. మలయాళ దర్శకుడు జెనూస్ మొహమద్, వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పైఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓషో వెంకట్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అభినందన్ రామానుజం ఈ సినిమాకు కెమెరా పనితనం చూపించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

Read also-Mana Doctor Babe: శ్రీ స్కంద ‘మన డాక్టర్ బాబే’ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ వచ్చేశాయి.. ఎలా ఉందంటే?

Just In

01

Xiaomi India Launch: భారత్‌ మార్కెట్లోకి Xiaomi 17, 17 Ultra, 17T.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

Medaram Jatara 2026: సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని… కీలక ఆదేశాలు జారీ చేసిన మల్టీ జోన్ ఐజీ

New Year Party: న్యూఇయర్ పార్టీకి ఆర్టీసీ బస్ డిపోలో మేక కటింగ్.. ప్రోత్సహించిన డిపో మేనేజర్!

Xiaomi Mix 5: త్వరలో మన ముందుకు రానున్న Xiaomi కొత్త ఫోన్?

Grok Saves Man Life: వ్యక్తి ప్రాణాలు కాపాడిన గ్రోక్.. అవాక్కైన ఎలాన్ మస్క్.. నెట్టింట ఆసక్తికర పోస్ట్